ETV Bharat / international

ఆగని కార్చిచ్చు- 20 లక్షల ఎకరాలకుపైగా దగ్ధం

author img

By

Published : Sep 8, 2020, 6:27 AM IST

కాలిఫోర్నియా అడవుల్లో మంటలు విస్తరిస్తున్నాయి. ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఇప్పటికే 20 లక్షల ఎకరాలకుపైగా అడవులు అగ్నికి ఆహుతైనట్లు తెలిసింది.

Wild fire in California
కాలిఫోర్నియా కార్చిచ్చు

అమెరికా కాలిఫోర్నియాలో కార్చిచ్చు అంతకంతకూ విస్తరిస్తోంది. మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. కార్చిచ్చు కారణంగా ఈ ఏడాది ఇప్పటివరకు కాలిఫోర్నియాలో 20 లక్షల ఎకరాలకుపైగా అడవులు దగ్ధమైనట్లు ఫారెస్ట్రీ అండ్ ఫైర్​ ప్రొటెక్షన్ (కాల్ ఫైర్) విభాగం వెల్లడించింది.

కాలిఫోర్నియావ్యాప్తంగా కార్చిచ్చు ప్రభావం ఇంకా ప్రమాదకర స్థాయిలోనే ఉన్నట్లు కాల్​ ఫైర్ పేర్కొంది. మంటలు అదుపు చేసేందుకు 14,100 మంది ఫైర్​ సిబ్బంది కృషి చేస్తున్నట్లు వెల్లడించింది.

కార్చిచ్చు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసొమ్ పలు కౌంటీలకు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. కాలిఫోర్నియా వ్యాప్తంగా ఆగస్టు 18నే అత్యవసర పరిస్థితిని ప్రకటించడం గమనార్హం.

ఇదీ చూడండి:తుపాను ధాటికి జపాన్ గజగజ.. నలుగురు గల్లంతు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.