బ్రెజిల్‌ను కరోనా వైరస్ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కొవిడ్ కేసుల్లో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్‌లో.. తాజాగా రికార్డుస్థాయిలో మరణాలు సంభవిస్తున్నాయి. 24 గంటల్లో అత్యధికంగా 4,195 మరణాలు నమోదైనట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. అమెరికా, పెరూల్లో మాత్రమే ఇప్పటివరకు ఒక్కరోజులో 4 వేల మరణాలు సంభవించాయి. బ్రెజిల్‌లో ఇప్పటివరకు 1.3 కోట్ల మంది కోవిడ్ బారినపడగా.. మహమ్మారి కారణంగా 3.37 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.
దేశంలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆంక్షలను సడలించడమే వైరస్ ఉద్ధృతికి కారణమని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
దేశంలో ఉన్న 90శాతం ఐసీయూల్లో కొవిడ్ రోగులే చికిత్స పొందుతున్నారు. వ్యాక్సినేషన్‌లో భాగంగా ఇప్పటివరకు.. బ్రెజిల్‌లో 3శాతం మంది ప్రజలు కొవిడ్ టీకాలు తీసుకున్నట్లు ఓ ఆన్లైన్ వెబ్సైట్ తెలిపింది.
ఇదీ చూడండి:మోడెర్నా టీకాతో 6 నెలల పాటు రక్ష!