ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న దేశాల్లో రెండో స్థానంలో నిలిచిన బ్రెజిల్లో వైరస్ వ్యాప్తి తీవ్రరూపం దాల్చుతోంది. ఒక్క రోజులో ఆ దేశంలో 1,473మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. 24 గంటల్లో ఇంతమంది మరణించడం ఆ దేశంలో ఇదే తొలిసారి. మొత్తం కేసుల సంఖ్య 6లక్షల 15వేల 840కి చేరింది. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 34వేల 39కి పెరిగింది.
దక్షిణ కొరియాలో 39 కొత్త కేసులు
దక్షిణ కొరియాలో కొత్తగా 39 కేసులు నమోదయ్యాయి. వీటిలో 34 కేసులు వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న రాజధాని సియోల్ ప్రాంతానికి చెందినవే. వైరస్ ప్రభావం పూర్తిగా తగ్గిందని భావించిన తర్వాత రోజురోజుకు కొత్త కేసులు పెరుగుతుండటం ప్రభుత్వానికి ఆందోళన కల్గిస్తోంది.
దక్షిణ కొరియాలో మొత్తం కేసుల సంఖ్య 11వేల 668కి చేరింది. ఇప్పటి వరకు 273మంది ప్రాణాలు కోల్పోయారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 67లక్షల 2వేల 793కి చేరింది. మహమ్మారి కారణంగా ఇప్పటివరకు 3లక్షల 93వేల 212మంది మరణించారు. వైరస్ బారిన పడి 32లక్షల 52వేల 308 మంది కోలుకున్నారు.
అత్యధిక కేసులున్న దేశాలు..
# | దేశం | కేసులు | మరణాలు |
1 | అమెరికా | 19,24,051 | 110,173 |
2 | బ్రెజిల్ | 6,15,870 | 34,039 |
3 | రష్యా | 4,41,108 | 5,384 |
4 | స్పెయిన్ | 2,87,740 | 27,133 |
5 | బ్రిటన్ | 2,81,661 | 39,904 |
6 | ఇటలీ | 2,34,013 | 33,689 |
7 | భారత్ | 2,26,770 | 6,348 |
8 | జర్మనీ | 1,84,923 | 8,736 |
9 | పెరూ | 1,83,198 | 5,031 |
10 | టర్కీ | 1,67,410 | 4,630 |