బ్రెజిల్ రియోడీజనీరోలో బస్సును హైజాక్ చేసిన సాయుధుడిని పోలీసులు కాల్చి చంపారు. రియోడీజనీరో-నితోరాయి వంతెనపై 4 గంటల పాటు జరిగిన హైడ్రామాకు తెరదించారు. మొత్తం ఈ బస్సులో 37 ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.
4 గంటల హైడ్రామా
రియోలో ఉదయం 5.30 గంటలకు నితోరాయి పట్టణం వెళ్లే బస్సు ఎక్కాడు నిందితుడు. తుపాకీతో ప్రయాణికులను బెదిరించాడు. బస్సుకు నిప్పుపెడతానని భయబ్రాంతులకు గురిచేశాడు. సుమారు 4 గంటల పాటు ఈ హైడ్రామా కొనసాగింది.
పోలీసుల భరోసా
మధ్యలో ఆరుగురిని విడుదల చేసినా 31 మంది మాత్రం చివరి వరకు బస్సులోనే ఉన్నారు. హైజాకర్తో పోలీసులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ప్రశాంతంగా ఉండమని, తాము మీతోనే ఉన్నామని ప్రయాణికులకు భరోసా ఇచ్చారు పోలీసులు.
వంతెనపై స్పాట్
బస్సును అదుపులోకి తెచ్చుకునేందుకు రియో, నితోరాయి పట్టణాలను కలిపే వంతెనను ఎంచుకున్నారు అధికారులు. భారీగా పోలీసులు, సైన్యాన్ని మోహరించారు. వంతెనపైకి ఎవరూ రాకుండా ముందు జాగ్రత్త తీసుకున్నారు. బస్సు రాగానే నిందితుడిని స్నైపర్లు మట్టుబెట్టారు. హైజాకర్ ఎవరన్నదీ పోలీసులు ఇంకా బయటపెట్టలేదు.
ఇదీ చూడండి: ఛోటా రాజన్కు 8 ఏళ్ల కఠిన కారాగార శిక్ష