బోస్టన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చేపట్టిన పరిశోధన వివరాల ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా అనేక రకాల కరోనా వైరస్లు ఉన్నాయి. వీటిలో కొన్నింటి వల్ల జలుబు, ఊపిరితిత్తుల వాపు వంటి సమస్యలు తలెత్తుతాయి. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న 'సార్స్-కొవ్-2 వైరస్ మాదిరే వీటి జన్యువులు కూడా ఉంటాయి. గతంలో సాధారణ కరోనా వైరస్ సోకినవారి రోగనిరోధక వ్యవస్థ ఈ జన్యువులను సులభంగా గుర్తుపడుతుంది. ఇలాంటి వారికి కొవిడ్ వచ్చినా రోగనిరోధక వ్యవస్థ వెంటనే స్పందిస్తుంది. కాబట్టి ముప్పు తీవ్రంగా ఉండదని పరిశోధకులు విశ్లేషించారు. ఈ పరిశోధన వివరాలను క్లినికల్ ఇన్వెస్టిగేషన్ పత్రిక అందించింది.
అధ్యయనంలో భాగంగా 2015-2020 మధ్య శ్వాసకోశ సమస్యలతో బాధపడినవారి ఆరోగ్య వివరాలను సేకరించారు. వారిలో ఎంతమంది కొవిడ్ బారిన పడ్డారు? ఐసీయూ, వెంటిలేషన్ వంటి వసతులు సమకూర్చాల్సి వచ్చింది? అన్న విషయాలను పరిశీలించారు. గతంలో సాధారణ కరోనా వైరస్‌కు గురైనవారికి ఇప్పుడు కొవిడ్ వచ్చినా, తీవ్రమైన ఆరోగ్య సమస్యలైతే ఏమీ తలెత్తడం లేదని తేల్చారు.