అమెజాన్ అరణ్య ప్రాంత రక్షణ, అభివృద్ధి, భవిష్యత్ గురించి లాటిన్ అమెరికా దేశాలే నిర్ణయించుకోవాలని బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారో అభిప్రాయపడ్డారు. ఇందుకోసం లాటిన్ అమెరికా దేశాలు సెప్టెంబర్‌లో సమావేశమవుతాయని ఆయన తెలిపారు.
"వెనుజువెలా మినహా అన్ని లాటిన్ అమెరికా దేశాలు సెప్టెంబర్‌లో సమావేశమవుతాయి. పర్యావరణాన్ని పరిరక్షణకు మా సొంత ఏకీకృత వ్యూహంతో ముందుకు వెళ్తాం. అమెజాన్ ప్రాంత దేశాల సుస్థిరతకు పాటుపడతాం."- బొల్సొనారో, బ్రెజిల్ అధ్యక్షుడు
అమెజాన్... కార్చిచ్చుకు ఆహుతి అవుతున్న వేళ... లాటిన్ అమెరికా దేశాల సమావేశం కానుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.
'ఒకే ఒక్కడు' అనుకుంటున్నాడు..
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్‌తో... బొల్సొనారో వ్యక్తిగత వివాదం కొనసాగుతోంది.
"పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడుతున్న 'ఒకే ఒక్కడు' తానేనని ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ భ్రమపడుతున్నాడు."- బొల్సొనారో, బ్రెజిల్ అధ్యక్షుడు
ఇప్పటికే భారీ నష్టం జరిగింది...
బ్రెజిల్లో రైతులు, డెవలపర్లు, ఇతరులు భూమి కోసం అడవులను భారీగా తగలబెట్టారు. ఫలితంగా ఇప్పటికే భారీగా అరణ్యాలు నాశనమయ్యాయి. బ్రెజిల్ ప్రభుత్వమూ పర్యావరణ భద్రతను గాలికి వదిలేసింది. ప్రస్తుతం కార్చిచ్చు మహారణ్యాలను నాశనం చేస్తోంది.
ఇదీ చూడండి: కశ్మీర్ నుంచి భారత్ వెనక్కుతగ్గాలని హెచ్చరిక
!