ETV Bharat / international

కరోనా కట్టడి కోసం భారత్​కు 'బోయింగ్' సాయం

బోయింగ్ సంస్థ భారత్​లో కరోనా కట్టడి కార్యక్రమాల కోసం భారీ విరాళం ప్రకటించింది. 10 మిలియన్ డాలర్లను అందించనున్నట్లు తెలిపింది. సంస్థ ఉద్యోగులు సైతం విరాళాలు ప్రకటించాలని పిలుపునిచ్చింది.

Boeing announces $10 mn emergency assistance package for India
భారత్​కు బోయింగ్ 10 మిలియన్ డాలర్ల సహాయం
author img

By

Published : May 1, 2021, 6:30 AM IST

కరోనా కట్టడి కోసం భారత్​కు సహాయం ప్రకటించింది ఏరోస్పేస్ దిగ్గజ సంస్థ బోయింగ్. 10 మిలియన్ డాలర్ల అత్యవసర సహాయ ప్యాకేజీని భారత్​కు అందించనున్నట్లు తెలిపింది. కరోనాతో పోరాడుతున్న వారికి వైద్య పరికరాలు అందించడం సహా ఇతర కార్యక్రమాలు చేపడుతున్న భారత్​లోని సంస్థలకు ఈ సహాయాన్ని అందిస్తామని సంస్థ స్పష్టం చేసింది.

బోయింగ్​ను ప్రపంచ పౌరుడిగా అభివర్ణించిన ఆ సంస్థ సీఈఓ డేవ్ కల్హౌన్.. ఈ విపత్కర సమయంలో భారత్​లోని ప్రజలకు తాము సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.

మరోవైపు, బోయింగ్ ఉద్యోగులు కూడా భారత్​లో సహాయ కార్యక్రమాల కోసం వ్యక్తిగతంగా విరాళాలు అందించవచ్చని సంస్థ పేర్కొంది. ఉద్యోగి ఇచ్చిన విరాళానికి అంతే మొత్తాన్ని జమ చేసి సహాయంలో సంస్థ భాగమవుతుందని తెలిపింది.

ఇదీ చదవండి- అమెజాన్ 3 నెలల ఆదాయం రూ.8 లక్షల కోట్లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.