ETV Bharat / international

బ్లింకెన్​ ఎంపికతో భారత్​కు లాభమేనా?

అమెరికా అధ్యక్షుడి తర్వాత అత్యంత కీలకమైంది ఆ దేశ విదేశాంగ మంత్రి పదవి. ప్రపంచానికి అమెరికా అధ్యక్షుడి మాట-చేతగా నిలిచే ఆ పదవిలో కొత్తగా ఆంటోనీ బ్లింకెన్​ను ఎంచుకున్నారు నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు జో బైడెన్. డొనాల్డ్ ట్రంప్ హయాంలో చెదిరిపోయిన అమెరికా ఆధిపత్యాన్ని పునరుద్ధరిస్తానని చెబుతున్న బ్లింకెన్ వైపు యావత్ ప్రపంచం ఆసక్తిగా చూస్తోంది. మరి ఆయన రాకతో భారత్​కేంటి? బైడెన్ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా కీలకం కాబోతున్న బ్లింకెన్.. భారత్ పట్ల ఎలాంటి వైఖరి అవలంబించొచ్చు? బైడెన్ బ్లింకెన్​నే ఎందుకు అత్యంత కీలకమైన ఆ పదవికి ఎంచుకున్నారు?

blinken as america foreign secretary is useful for india?
బ్లింకెన్​తో భారత్​కు లాభమేనా?
author img

By

Published : Nov 26, 2020, 8:00 AM IST

Updated : Nov 26, 2020, 11:59 AM IST

ఒక దేశ విదేశాంగ మంత్రి ఎవరనేది ప్రపంచానికి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేనిదే కావొచ్చు! కానీ అమెరికా విదేశాంగ మంత్రి అంటే మాత్రం అలా కాదు. అమెరికా అధ్యక్షుడి తర్వాత అత్యంత కీలకమైన పదవి అది! ప్రపంచానికి అమెరికా అధ్యక్షుడి మాట-చేతగా నిలిచే ఆ పదవిలో కొత్తగా ఆంటోనీ బ్లింకెన్​(58)ను ఎంచుకున్నారు కొత్త అధ్యక్షుడు జో బైడెన్.

డొనాల్డ్ ట్రంప్ హయాంలో చెదిరిపోయిన అమెరికా ఆధిపత్యాన్ని పునరుద్ధరిస్తానని చెబుతున్న బ్లింకెన్ వైపు యావత్ ప్రపంచం ఆసక్తిగా చూస్తోంది. మరి భారత్​ కేంటి? బైడెన్ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా కీలకం కాబోతున్న బ్లింకెన్.. భారత్ పట్ల ఎలాంటి వైఖరి అవలంబించొచ్చు? బైడెన్ బ్లింకెన్​నే ఎందుకు అత్యంత కీలకమైన ఆ పదవికి ఎంచుకున్నారు?

బైడెన్-బ్లింకెన్ బంధాన్ని అమెరికా రాజకీయ చరిత్రలోనే సుదీర్ఘమైనదిగా, బలమైన వాటిలో అరుదైనదిగా చెబుతారు. బైడెన్​కు తనను అత్యంత సన్నిహితుడిగా చెబుతారు. వీరిద్దరి బంధం 20 ఏళ్లుగా కొనసాగుతోంది. 2002లో సెనెట్ విదేశాంగ వ్యవహారాల కమిటీలో తాను కీలకంగా ఉన్నప్పుడు.. బ్లింకెన్​ను ఆ కమిటీ స్టాప్ డైరెక్టర్ గా బైడెన్ నియమించారు. 'బైడెన్​తో అనుబంధం, స్నేహం.. అద్భుతంగా సాగుతోంది'అంటారు బ్లింకెన్​! అందుకే.. బ్లింకెన్ మాట్లాడారంటే... బైడెన్ చెప్పినట్లే.

మళ్లీ అమెరికా.

ప్రపంచం ఎటుపోయినా... ముందు మనది మనం చూసుకుందాం (అమెరికా ఫస్ట్) అంటూ సాగిన ట్రంప్​కు పూర్తి వ్యతిరేకం బైడెన్-బ్లింకెన్ జోడీ! అమెరికా ఫస్ట్ స్థానంలో మళ్లీ అమెరికా (అమెరికా ఎగెయిన్) అంటూ అమెరికా అధిపత్యాన్ని పునురుద్దరించడం ప్రధాన కర్తవ్యంగా వీరిద్దరి జోడీ సాగుతుంది. అమెరికా మిత్ర దేశాలతో పొత్తులను పునరుద్ధరించడం, నాటోనూ బలోపేతం చేయడం, ఐక్యరాజ్య సమితి, ఆరోగ్య సంస్థలాంటి అంతర్జాతీయ సంస్థలతో సత్సంబంధాలు కలిగి ఉండటానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. "ప్రపంచం తనంతట తాను అన్నీ సిద్ధం చేసుకోలేదు. అమెరికా ఆ పని చేసి పెడుతుంది. దౌత్యనీతి ద్వారా అమెరికా మళ్ళీ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోబోతోంది" అనేది బ్లింకెన్ పదేపదే చెప్పే మాట. అంటే ప్రపంచ గమనానికి అమెరికా ఇరుసులా పనిచేస్తుందన్నది ఆయన అంతరంగం.

  • యూరప్​తో బంధం బలపడాలని, అందులోనే అమెరికా ప్రయోజనాలున్నాయన్నది ఆయన బల మైన నమ్మకం. జర్జనీ నుంచి అమెరికా బలగాలను ఉపసంహరించటం ద్వారా నాటోను ట్రంప్ ప్రభుత్వం బలహీనపర్చించన్నది బ్లింకెన్​ మాట.
  • అమెరికా ఆధిపత్యం నిరూపించుకోవటానికి, అవసరమైతే బలప్రయోగం చేయటంలో తప్పులేదన్నది తన ఆలోచన. అందుకే 2003లో జార్జ్ బుష్ (రిపబ్లికన్ పార్టీ) ఇరాక్ పై దాడిచేసినప్పుడు.. సెనెట్ విదేశాంగ వ్యవహారాల విభాగంలో డెమొక్రాట్ల డైరెక్టర్​గా పనిచేసిన బ్లింకెన్​ అందుకు మద్దతు తెలిపారు.

అమెరికా సారథ్యం చూస్తారు

"అమెరికా ముందు ఒకటికాదు. అనేక సవాళ్లున్నాయి. ప్రపంచ వేదికపై టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సాయంతో కొత్త శక్తులు ఉద్భవించాయి. అవి అమెరికాకు సవాలు విసురుతున్నాయి. వాటిని భాగస్వాములుగా చేసుకొని ఎలా ముందుకు సాగాలో ఆమెరికా తేల్చుకోవాలి. ప్రపంచం ఎదుర్కొంటున్న చాలా సమస్యలు అమెరికావి కావు. కానీ అవి మనల్ని ప్రభావితం చేస్తాయి. మనం చొరవ తీసుకొని పరిష్కరించకుంటే వేరెవరో ఆ పని చేయొచ్చు. వాళ్లు అమెరికా విలువల ఆధారంగా వాటిని పరిష్కరించారు. అప్పుడది మనకు సమస్యగా మారుతుంది. ఎవరూ పరిష్కరించకుండా సమస్యలు మరింత ముదిరిపోవచ్చు. అది కూడా అమెరికాకు మంచిది కాదు కాబట్టి. బైడెన్ తప్పకుండా దౌత్యనీతి ద్వారా అమెరికా సారథ్యాన్ని నిలబెడతారు. ఇక మీదట ప్రతిరోజూ దాన్ని మీరు చూడబోతారు. అది కూడా... 2000, 2017ల్లో మాదిరిగా కాకుండా కొత్త తరహాలో - భవిష్యత్ కోసం" అని బ్లింకెన్ మనసులో మాట స్పష్టం చేశారు

గిటార్, ఫుట్ బాల్, ఫ్రెంచ్

  • చిన్నప్పుడే తల్లిదండ్రులు విడిపోవటంతో.. బ్లింకెన్​ పారిస్​లో చదువుకున్నారు. ప్రెంచ్ ఎంతో స్పష్టంగా మాట్లాడుతారు.
  • తండ్రి డొనాల్డ్ బ్లింకెన్​ దౌత్యవేత్త. క్లింటన్ హయాంలో స్పెయిన్ అమెరికా రాయబారిగా వ్యవహరించారు. బ్లింకెన్​ భార్య ఎవాన్ రైన్ కూడా అమెరికా ప్రభుత్వంలో పనిచేసేవారు. క్లింటన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు హిల్లరీ క్లింటర్ వద్ద ఆమె పనిచేసేవారు. అప్పుడు బ్లింకెన్​ జాతీయ భద్రతా మండలిలో పనిచేసేవారు. 2002లో వీరిద్దరి పెళ్లికి క్లింటన్ దంపతులు హాజరయ్యారు. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు.
  • బ్లింకెన్ గిటార్ బాగా వాయిస్తారు. పుట్ బాల్ కూడా ఆడతారు.

ఇదీ చూడండి: భారత్​పై డబ్ల్యూటీఓకు అమెరికా ఫిర్యాదు

Last Updated : Nov 26, 2020, 11:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.