ETV Bharat / international

ఒమిక్రాన్​పై బిల్​గేట్స్ హెచ్చరిక... అలా చేయకపోతే అంతే!

author img

By

Published : Dec 23, 2021, 6:50 AM IST

Bill gates Omicron tweet: వేగంగా విస్తరిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ నుంచి తప్పించుకునేందుకు ప్రజలందరూ టీకాలు వేసుకోవాలని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్​ గేట్స్ సూచించారు. ఇప్పటికే టీకా రెండు డోసులు పొందిన వారు బూస్టర్‌ డోసు తీసుకుంటే మరింత సురక్షితంగా ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. కొత్త వేరియంట్‌ గురించి పూర్తిగా తెలిసే వరకూ మనందరం మరింత అప్రమత్తంగా ఉండాలని గేట్స్‌ హెచ్చరించారు.

bill gates omicron tweet
bill gates omicron tweet

Omicron Bill Gates: ఒమిక్రాన్‌ రకం కరోనా వైరస్‌ వేగంగా విస్తరించే స్వభావం కలిగి ఉందని, ప్రపంచంలోని అన్ని దేశాలకూ ఇది ఎగబాకుతోందని మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ హెచ్చరించారు. డెల్టా వేరియంట్‌ కన్నా తీవ్రత తక్కువ ఉన్నప్పటికీ కొత్త వేరియంట్‌ శరవేగంతో వ్యాప్తి చెందుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ముప్పు నుంచి రక్షణ పొందాలంటే తక్షణమే టీకాలను పొందాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే టీకా రెండు డోసులు పొందిన వారు బూస్టర్‌ డోసు తీసుకుంటే మరింత సురక్షితంగా ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.

Bill gates tweet on Omicron

ప్రపంచ కుబేరుడైన గేట్స్‌ నేతృత్వంలోని 'బిల్‌ అండ్‌ మిలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ కరోనా టీకాల అభివృద్ధికి భారీగా నిధులు అందిస్తున్న విషయం తెలిసిందే. కొత్త వేరియంట్‌ గురించి పూర్తిగా తెలిసే వరకూ మనందరం మరింత అప్రమత్తంగా ఉండాలని గేట్స్‌ పేర్కొన్నారు. 'పరిస్థితులన్నీ చక్కబడుతున్నాయని భావిస్తున్న వేళ ఒమిక్రాన్‌ రూపంలో మరో వేరియంట్‌ విరుచుకుపడుతోంది. మనందరికీ ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే నా సన్నిహిత మిత్రులు కొందరికి ఆ వైరస్‌ సోకింది. నా సెలవుల ప్రణాళికను రద్దు చేసుకున్నాన'ని బిల్‌ గేట్స్‌ వరుసగా చేసిన పలు ట్వీట్స్‌ ద్వారా తెలిపారు.

Bill gates telugu news

'నూతన సంవత్సర వేళ సెలవులకు, వినోద విహారాలకు సిద్ధమవుతున్న మనందరికీ ఒమిక్రాన్‌ ఆందోళన కలిగిస్తోంది. అయితే, ఇదే పరిస్థితి ఎల్లవేళలా కొనసాగబోదు. కొన్ని రోజులకు ఈ మహమ్మారి బెడద తొలగిపోతుంది. అప్పుడు బంధుమిత్రులందరినీ సంతోషంగా కలుసుకోవచ్చు. అటువంటి సమయం త్వరలోనే వస్తుంద'ని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అమెరికాలో ఒమిక్రాన్‌ అత్యంత వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ హెచ్చరికలు చేశారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.