ETV Bharat / international

అమెరికా ఉపాధ్యక్ష రేసులో భారత సంతతి కమలా హ్యారిస్​ - joe biden updates

అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్​ను ఎంపిక చేసినట్లు చెప్పారు డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్​. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆమెను భాగస్వామిగా చేసుకోవడం గర్వంగా ఉందన్నారు. అయితే బైడెన్ హ్యారిస్​ను ఎంపిక చేసుకోవడం తనకు ఆశ్చర్యం కలిగించిందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ అన్నారు.

bidens-vp-pick-kamala-harris-has-deep-indian-roots
అమెరికా ఉపాధ్యక్ష రేసులో భారత సంతతి కమలా హ్యారిస్​
author img

By

Published : Aug 12, 2020, 5:15 AM IST

Updated : Aug 12, 2020, 11:39 AM IST

భారత సంతతికి చెందిన కాలిఫోర్నియా సెనేటర్​ కమలా హ్యారిస్​ను డెమోక్రాట్ల ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న జో బైడెన్​ ప్రకటించారు. ఆమెను ఎంచుకోవడం తనకు గర్వంగా ఉందన్నారు. హ్యారిస్​ పోరాట యోధురాలని.. ఎంతోకాలంగా ప్రజాసేవ చేస్తున్నారని కొనియాడారు. ఆమెతో కలిసి ఎన్నికల ప్రచారంలో ముందుకు వెళ్లడం అనందంగా ఉందని బైడెన్​ అన్నారు.

ఉపాధ్యక్ష అభ్యర్థిగా బైడెన్​ తనను ఎంపిక చేసుకోవడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు కమలా హ్యారిస్ చెప్పారు. ఆయన అమెరికా ప్రజలను ఐక్యం చేయగల సమర్థవంత నాయకుడని ప్రశంసించారు. ప్రజల కోసమే బైడెన్​ ఎంతోకాలంగా పోరాడుతున్నారని, మన ఆదర్శాలకు అనుగుణంగా అమెరికాను నిర్మించగలరని అన్నారు.

కమలా హారిస్‌ తల్లి భారతీయురాలు కాగా, తండ్రి ఆఫ్రికాలోని జమైకా దేశస్థుడు. తమిళనాడుకు చెందిన కమల తల్లి శ్యామలా గోపాలన్‌ 1960లో అమెరికా వలస వెళ్లి అక్కడే స్థిర పడ్డారు.

ట్రంప్​ ఆశ్చర్యం..

ప్రాథమిక ఎన్నికల్లో పేలవ ప్రదర్శన కనబర్చిన హ్యారిస్​ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా బైడెన్​ ఎంచుకోవడం తనకు ఆశ్చర్యాన్ని కల్గించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ స్పందించారు. ఆమె బైడెన్​ పట్ల అగౌరవంగా ఉన్నారని, అలాంటి వారిని ఎంపిక చేసుకోవడం కఠిన నిర్ణయమే అని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: ట్రంప్​ మాట్లాడుతుండగా శ్వేతసౌధం వద్ద కాల్పులు

Last Updated : Aug 12, 2020, 11:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.