ETV Bharat / international

'అమెరికా దళాలపై దాడులకు రష్యా కుట్ర' - america latest news

అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ట్రంప్​ పాలనపై మరోసారి విరుచుకపడ్డురు డెమోక్రాట్ల తరఫున అధ్యక్ష పదవికి పోటీ చేయనున్న జో బైడెన్​. అఫ్గానిస్థాన్​లో అమెరికా బలగాలను అంతమొందిస్తే నగదు బహుమానం ఇస్తామని రష్యా మిలిటరీ వర్గాలు తాలిబన్లతో చర్చలు జరిపినట్లు తెలిసినా ట్రంప్​ ఎందుకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. న్యూయార్క్ టైమ్స్​ నివేదిక ఆధారంగా ట్రంప్​పై ధ్వజమెత్తారు బైడెన్​.

Biden slams Trump over reported bounties placed on US troops
మెరికా దళాలపై దాడులకు రష్యా కుట్ర! ట్రంప్​పై బిడెన్​ ధ్వజం
author img

By

Published : Jun 28, 2020, 2:57 PM IST

అమెరికాలో న్యూయార్క్​ టైమ్స్​ బహిర్గతం చేసిన నివేదిక ఆధారంగా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​పై విమర్శలతో విరుచుకుపడ్డారు డెమోక్రాట్ల నేత జో బైడెన్​. ఈ వార్త వాస్తవం అయితే అఫ్ఘానిస్తాన్​లోని అమెరికా దళాలకు ట్రంప్ రక్షణ కల్పించలేకపోయారని, రష్యాకు ఆయన అండగా నిలవడం దిగ్భ్రాంతి కల్గిస్తోందన్నారు.

' అఫ్గానిస్థాన్​లో విధులు నిర్వహిస్తున్న అమెరికా బలగాలపై దాడి చేస్తే భారీ నగదు బహుమతి ఇస్తామని రష్యా మిలిటరీ నిఘావర్గాలు తాలిబన్లతో సంబంధమున్న ఉగ్రవాదులకు రహస్యంగా ఆఫర్ ఇచ్చాయి. అమెరికా నిఘా వర్గాలు ఈ విషయాన్ని కొద్ది నెలల క్రితమే నిర్ధరించాయి. ఈ విషయాన్ని ట్రంప్​ దృష్టికి తీసుకెళ్లాయి. అయినప్పటికీ ఆయన ఎలాంటి చర్యలు చేపట్టలేదు.' అని న్యూయార్క్​ టైమ్స్​ కథనం ప్రచురించింది.

ఈ వార్తలు నిజమైతే ట్రంప్ దేశానికి ద్రోహం చేసినట్టేనని బైడెన్​ మండిపడ్డారు. అత్యంత పవిత్రమైన, బాధ్యతాయుతమైన పదవిలో ఉండి దేశ బలగాలను రక్షించే ప్రయత్నం చేయకపోవడమేంటని దుయ్యబట్టారు. అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించిన రష్యాపై ఆంక్షలు విధించడంలో ​ వైఫల్యం చెందారని విమర్శించారు. రష్యా అధ్యక్షుడి ముందు ట్రంప్​ తనను తాను దిగజార్చుకున్నారని ఆరోపించారు. తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే రష్యాపై కచ్చితంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు బైడెన్​.

శ్వేతసౌధం ఖండన..

న్యూయార్క్ ట్రైమ్స్​​ నివేదికను శ్వేతసౌధం ఖండించింది. అది తప్పుడు వార్త అని తెలిపింది. అమెరికా బలగాలపై దాడులకు కుట్రకు సంబంధించి నిఘా వర్గాలు ట్రంప్​కు గానీ, ఉపాధ్యక్షుడు మైక్​ పెన్స్​కు గానీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదని పేర్కొంది.

కొట్టిపారేసిన రష్యా..

న్యూయార్క్​ టైమ్స్​ నివేదికను రష్యా కొట్టిపారేసింది. అమెరికా నిఘవర్గాల అసమర్థతకు ఇది నిదర్శనమని ఘాటుగా స్పందించింది. ఆమోదయోగ్య విషయాలు కనిపెట్టాల్సింది పోయి అర్థంపర్థంలేని వార్తలు ప్రచారం చేస్తున్నారని విమర్శించింది.

ఇదీ చూడండి: భారతీయ-అమెరికన్ల మద్దతు పట్ల ట్రంప్ ఖుషీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.