అఫ్గానిస్థాన్లో అమెరికా జరిపిన రెండు దశాబ్దాల యుద్ధం దాదాపుగా ముగిసింది. ఆగస్టు 31 కల్లా అఫ్గాన్ నుంచి తమ సైన్యం పూర్తిగా నిష్క్రమించనుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. ఈ ప్రక్రియను వేగంగా పూర్తి చేయడమే క్షేమదాయకమని వ్యాఖ్యానించారు.
సైనికులను పూర్తి స్థాయిలో వెనక్కి రప్పించేందుకు అమెరికా యంత్రాంగం కృషి చేస్తున్న నేపథ్యంలో.. దేశ నిర్మాణానికి తాము అఫ్గానిస్థాన్ వెళ్లలేదని బైడెన్ అన్నారు. అఫ్గాన్ నేతలు ఒకచోట చేరి భవిష్యత్తును నిర్మించుకోవాలని వ్యాఖ్యానించారు.
అఫ్గాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ నేపథ్యంలో తాలిబాన్లు రెచ్చిపోతున్నారు. పూర్వం తమ అధీనంలో ఉన్న ప్రాంతాలను తిరిగి తమ నియంత్రణలోనికి తెచ్చుకుంటున్నారు. అయినప్పటికీ బలగాలను వెనక్కి రప్పించడం సరైన నిర్ణయమే అని బైడెన్ సమర్థించుకున్నారు.
ఇదీ చదవండి:'వందేళ్లయినా తాలిబన్లు ఆ పని చేయలేరు!'