ETV Bharat / international

అఫ్గాన్​ దాడిలో మృతిచెందిన సైనికులకు బైడెన్ నివాళి - కాబుల్ విమానాశ్రయంలో దాడి

ఐసిస్‌-కె ఉగ్రవాద సంస్థ కాబుల్‌ విమానాశ్రయం వద్ద జరిపిన ఆత్మాహుతి దాడిలో మృతిచెందిన 13 మంది అమెరికా సైనికులకు ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ నివాళులు అర్పించారు. ప్రథమ మహిళ జిల్​ బైడెన్​తో కలిసి.. డెలవేర్​లోని డోవర్​ ఎయిర్ ఫోర్స్​లో నివాళులు అర్పించారు.

Biden
బైడెన్
author img

By

Published : Aug 30, 2021, 5:06 AM IST

కాబుల్‌ విమానాశ్రయంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో మృతిచెందిన 13 మంది అమెరికా సైనికులకు నివాళులు అర్పించారు అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్. అమెరికా ప్రథమ మహిళ జిల్​ బైడెన్​తో కలిసి డెలవేర్​లోని డోవర్​ ఎయిర్ ఫోర్స్ వద్దకు చేరుకున్నారు బైడెన్​. సైనికుల మృతదేహాలకు నివాళులు అర్పించారు. మృతుల కుటుంబ సభ్యులను కలిశారు.

ఆత్మాహుతి దాడిలో మృతిచెందిన సైనికులంతా 20-31 ఏళ్లలోపు వారే. వారు అమెరికాలోని కాలిఫోర్నియా, మసాచుసెట్స్ రాష్ట్రాలకు చెందినవారు. మృతుల్లో ఐదుగురికి కేవలం 20ఏళ్లే. గతేడాది ఫిబ్రవరి నుంచి 13 మంది అమెరికా సైనికులు మరణించటం ఇదే తొలిసారి.

మృతిచెందినవారిని ఇదివరకే.. హీరోలుగా అభివర్ణించారు బైడెన్. శనివారం ఐఎస్ఎస్​-కే ఉగ్రసంస్థ స్థావరాలపై డ్రోన్‌ దాడి జరిపిన అమెరికన్ దళాలు ఆత్మాహుతి దాడికి సూత్రధారి సహా మరో ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. అంతకుముందు కాబుల్ విమానాశ్రయంలో(Kabul Airport) ఐసిస్ జరిపిన దాడుల్లో మొత్తం 180మందికిపైగా మృతి చెందారు.

ఇదీ చదవండి: Kabul Attack: కాబుల్​లో తీవ్ర ఉద్రిక్తత.. ఆ వాహనంపై అమెరికా వైమానిక దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.