ETV Bharat / international

ఆ భేటీ కోసం 110 దేశాలకు బైడెన్​ ఆహ్వానం- చైనాకు​ ఝలక్​​ - అమెరికా వర్చువల్​ భేటీ

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ (Biden news).. చైనా, రష్యాకు ఝలక్​ ఇచ్చారు. ప్రజాస్వామ్యంపై నిర్వహించ తలపెట్టిన వర్చువల్​ సమావేశానికి 110 దేశాలను ఆహ్వానించిన బైడెన్​.. చైనా, రష్యాను దూరం పెట్టారు. భారత్​కు చోటు దక్కింది.

Biden invites 110 countries to virtual summit
110 దేశాలకు బైడెన్​ ఆహ్వానం, చైనా లేదు, biden, china
author img

By

Published : Nov 24, 2021, 9:29 AM IST

ప్రజాస్వామ్యంపై డిసెంబర్​ 9-10 తేదీల్లో అమెరికా వర్చువల్​ సమావేశం నిర్వహించనుంది. ఈ భేటీకి 110 దేశాలకు ఆహ్వానం అందగా.. అధ్యక్షుడు జో బైడెన్​ అధ్యక్షత వహించనున్నారు. చైనా, రష్యాను (US china news) ఆయన ఈ సమావేశానికి దూరం పెట్టడం విశేషం. అగ్రరాజ్యం నేతృత్వంలోని నాటో సభ్యదేశమైన టర్కీకి కూడా ఆహ్వానం అందలేదు.

చైనా తమ అధీనంలోకి తెచ్చుకోవాలనుకుంటున్న తైవాన్​కు (US taiwan relations) మాత్రం పిలుపు అందింది. ఇది అమెరికా- చైనా (US china ties) ఉద్రిక్తతల్ని మరింత పెంచే అవకాశం ఉంది.

అక్కడి విదేశాంగ శాఖ ప్రచురించిన ఆహ్వాన దేశాల జాబితాలో అమెరికా మిత్రదేశాలు ఉన్నాయి. భారత్​, ఇరాక్​, పాకిస్థాన్​ కూడా భేటీలో పాల్గొంటాయి.

దక్షిణాసియాలో అఫ్గానిస్థాన్​, బంగ్లాదేశ్​, శ్రీలంకకు కూడా ఆహ్వానం అందలేదు.

ఇదీ చూడండి: తైక్వాండోలో పుతిన్​కు దీటుగా ట్రంప్- బ్లాక్​ బెల్ట్​తో నయా రికార్డ్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.