ETV Bharat / international

భారతీయ అమెరికన్​కు శ్వేతసౌధంలో కీలక బాధ్యతలు! - నీరా టాండెన్​కు ఓఎంబీ డైరెక్టర్ పదవి

వచ్చే ఏడాది అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న జో బైడెన్ తన పాలనా బృందం ఏర్పాటుకు కసరత్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా శ్వేతసౌధం కీలక పదవుల్లో ఒకటైన ఆఫీస్ ఆఫ్ మేనేజ్​మెంట్ అండ్ బడ్జెట్ డైరెక్టర్​గా భారతీయ అమెరికన్​ నీరా టాండెన్​ను నియమించనున్నట్లు తెలిసింది.

Neera Tanden to nominate as Director of OMB
ఓఎంబీ డెరెక్టర్​గా నీరా టాండెన్
author img

By

Published : Nov 30, 2020, 9:15 AM IST

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ భారత సంతతికి చెందిన మరో మహిళకు కీలక పదవి ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. శ్వేతసౌధంలో ఉన్నత పదవుల్లో ఒకటైన ఆఫీస్ ఆఫ్ మేనేజ్​మెంట్ అండ్ బడ్జెట్​ డైరెక్టర్​గా భారతీయ అమెరికన్​ నీరా టాండెన్​ను ఎంపిక చేయాలని బైడెన్ భావిస్తున్నారు.

అమెరికా సెనేట్​ నుంచి ఈ నియామకంపై అధికారిక ప్రకటన వెలువడితే.. ఆఫీస్ ఆఫ్ మేనేజ్​మెంట్ అండ్ బడ్జెట్​ డైరెక్టర్​గా బాధ్యతలు స్వీకరించిన తొలి మహిళగా నీరా టాండెన్ చరిత్ర సృష్టిస్తారు. నీరా ప్రస్తుతం సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెస్ లెఫ్ట్-లీనింగ్ సెంటర్ చీఫ్ ఎగ్జిక్యుటివ్​గా ఉన్నారు.

ట్రెజరీ సెక్రెటరీ నామినీ జనెట్ ఎల్​తో కలిపి పని చేయడం సహా.. ప్రణాళికాబద్దమైన ఆర్థిక సలహాదారుల బృందాన్ని ఎర్పాటు చేసుకునే వ్యూహంలో భాగంగా బైడెన్ ఈ నిర్ణయం తీసుకోవచ్చని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.

నీరా టాండెన్​ సహా జనెట్ ఎలెన్​ల నియామకంపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని అమెరికా మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

ఇదీ చూడండి:బైడెన్ ప్రెస్ బృందంలో అందరూ మహిళలే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.