అమెరికా అధ్యక్షుడి రోజువారీ కార్యకలాపాల వివరాల(ప్రెసిడెంట్ డెయిలీ బ్రీఫ్-పీడీబీ)ను జో బైడెన్‌కు అందించింది శ్వేతసౌధం. రక్షణ సంబంధిత వివరాలతో పాటు అత్యంత రహస్య సమాచారం ఇందులో ఉంటుంది. ప్రస్తుతం డెలావేర్‌లోని విల్మింగ్టన్లో ఉన్న బైడెన్ అక్కడే ఈ పీడీబీని స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. వాణిజ్య శాఖలోని సురక్షితమైన గదిలో కమలా హారిస్ వీటిని అందుకున్నట్లు చెప్పారు.
ఇప్పటి నుంచి ప్రమాణస్వీకారం రోజు వరకు బైడెన్, కమలా హారిస్‌కు ఈ వివరాలు అందుబాటులో ఉండనున్నాయి. ప్రమాణస్వీకారం తర్వాత అధ్యక్షుడి హోదాలోని బైడెన్‌కు ఈ వివరాలను అందిస్తారు అధికారులు.
ఎన్నికల ఫలితాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొండి వైఖరి అవలంబించడం వల్ల పీడీబీని అనుకున్న సమయం కంటే ఆలస్యంగా బైడెన్‌కు చేరింది. ఇటీవలే అధికార బదిలీకి ట్రంప్ అంగీకరించిన నేపథ్యంలో పీడీబీని తదుపరి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న బైడెన్‌కు అందించేలా శ్వేతసౌధం ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చదవండి- అధికార బదిలీ ప్రక్రియలో మరో ముందడుగు