డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్, ఆయన కుమారుడు హంటర్ బైడెన్‌పై తీవ్ర విమర్శలు గుప్చించారు జూనియర్ ట్రంప్. హంటర్ బైడెన్ చైనాకు 1.5 బిలియన్ డాలర్లకు అమ్ముడుపోయారని ఆరోపించారు. అందుకే ఆయన చైనాకు వంతపాడుతున్నారని జూనియర్ ట్రంప్ విమర్శించారు.
బైడెన్ అవినీతిపై పుస్తకం..
చైనా నుంచి ఎలాంటి ప్రమాదం ఉందో భారతీయ-అమెరికన్లకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని జూనియర్ ట్రంప్ తెలిపారు. ఈ సందర్భంగా జో బైడెన్.. ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో జరిగిన అవినీతిపై జూనియర్ ట్రంప్ ఓ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఇందులో జో బైడెన్ కుటుంబం అవినీతి అక్రమాలు పొందుపరిచినట్లు వివరించారు. ఈ పుస్తకాలపై సంతకం చేసి తన మద్దతుదారులకు అందించారు జూనియర్ ట్రంప్.