ETV Bharat / international

'అఫ్గాన్​లో ఘర్షణలకు బాధ్యతాయుతమైన ముగింపు'

author img

By

Published : Apr 10, 2021, 10:16 AM IST

అఫ్గాన్​లో ఘర్షణలకు బాధ్యతాయుతమైన ముగింపు చెప్పేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కట్టుబడి ఉన్నారని శ్వేతసౌధం పేర్కొంది. త్వరలోనే ఆ దేశం నుంచి తమ బలగాల ఉపసంహరిస్తామని తెలిపింది. తైవాన్​ విషయంలో చైనాతో ఓపికగా సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పింది.

america about afghanistan conflict
'అఫ్గాన్​ ఘర్షణకు బాధ్యాతాయుతమైన ముగింపు'

అఫ్గానిస్థాన్​లో హింసకు బాధ్యతాయుతమైన ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కట్టుబడి ఉన్నారని తెలిపింది అమెరికా. మళ్లీ ఆ దేశం ఉగ్రవాదులకు స్వర్గధామంలా ఎప్పటికీ మారకుండా చర్యలు తీసుకోనున్నట్లు శ్వేతసౌధ మీడియా సెక్రెటరీ జెన్​ సాకి.. శుక్రవారం వెల్లడించారు.

"అఫ్గాన్​లో చెలరేగుతున్న ఘర్షణలకు బాధ్యతాయుతమైన ముగింపు ఇచ్చేందుకు బైడెన్​ కట్టుబడి ఉన్నారు. అమెరికా బలగాలను ఆ దేశం నుంచి ఉపసంహరించేలా, ఉగ్రవాదులకు అఫ్గాన్ మళ్లీ స్థిర స్థావరంలా మారకుండా చర్యలు చేపడుతున్నారు. మే 1 లోపు ఆ దేశం నుంచి అమెరికా బలగాలను ఉపసంహరించడం సవాలుతో కూడుకున్నదే కానీ, అంతకంటే ముందే ఆ ప్రక్రియ పూర్తయిందనే వార్త వింటామని నేను భావిస్తున్నాను."

- జెన్​ సాకి, వైట్​హౌస్​ మీడియా సెక్రెటరీ.

ఇతర భాగస్వామ్య దేశాలతో సంప్రదింపులు, జాతీయ భద్రతా బృంద సూచనల ప్రకారం అఫ్గాన్​ నుంచి బలగాల ఉపసంహరణపై జో బైడెన్​ నిర్ణయం తీసుకుంటారని జెన్ సాకి తెలిపారు. దేశ ప్రయోజనాలను కాపాడే విధంగా, బలగాల భద్రతే ధ్యేయంగా ఆయన చర్యలు చేపడుతారని స్పష్టం చేశారు. అదే సమయంలో.. తాలిబన్లతోనూ దౌత్యచర్చలు జరుపుతారని పేర్కొన్నారు.

చైనాతో ఓపికగా సంప్రదింపులు..

తైవాన్​పై చైనా వ్యవహరిస్తున్న తీరును అమెరికా నిశితంగా పరిశీలిస్తోందని జెన్​సాకి తెలిపారు. ఈ విషయమై చైనాతో అమెరికా ఓపికగా సంప్రదింపులు జరుపుతోందని స్పష్టం చేశారు.

"తైవాన్​పై చైనా అనుసరిస్తున్న విధానాలపై మా ఆందోళనను అన్ని విధాలుగా వ్యక్తపరుస్తున్నాం. తైవాన్‌లో ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కడానికి బలవంతపు చర్యలను చైనా చేపట్టింది. తైవాన్​లో చైనా ఆర్మీ కార్యకలాపాలు.. అస్థిరతను కలిగిస్తుందని మేము నమ్ముతున్నాము. ఈ విషయమై మేము హడావుడిగా కాకుండా చైనాతో ఓపికగా సంప్రదింపులు జరుపుతున్నాం. మా దేశంలోని అంతర్గత పరిస్థితులను బలోపతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. అదే సమయంలో బలమైన నాయకత్వంతో భాగస్వామ్య దేశాలతో ముందుకు సాగుతున్నాం. "

-జెన్​ సాకి, వైట్​హౌస్​ మీడియా సెక్రెటరీ

దేశంలో మౌలిక వసతుల నిర్మాణంపై తాము ప్రస్తుతం దృష్టి సారించామని, అదే విధంగా తమ భాగస్వామ్య దేశాలతోనూ కలిసి పని చేస్తున్నామని జెన్​సాకి పేర్కొన్నారు.

ఇదీ చూడండి: అమెరికా నౌక సంచారంపై భారత్​ తీవ్ర అభ్యంతరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.