అమెరికాలోని అయోవా రాష్ట్రాన్ని మంచు తుపాను వణికిస్తోంది. గత వారం రోజుల నుంచి కురుస్తోన్న మంచు కారణంగా తీరప్రాంత నగరాలైన దులుత్, సురీరియన్ విస్కాన్సిన్‌లు సుమారు 20 అంగుళాల మంచులో కూరుకుపోయాయి. మంచును తొలగించేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది.
శీతాకాల తుపాను హెచ్చరికలు..
మంచు తుపాను కారణంగో సుపీరియర్ సరస్సు పరిసరాల్లో సుమారు 10 అంగుళాల మేర మంచు పేరుకుపోయే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తోంది శీతాకాలపు తుపాను విభాగం. ఈశాన్య మిన్నెసోటా, ఈశాన్య విస్కాన్సిన్ ప్రాంతాల్లో శీతాకాల తుపాను హెచ్చరికలు జారీ చేసింది అమెరికా జాతీయ వాతావరణ సేవల విభాగం. ఉత్తర డకోటాలోని ఫార్గోలో అత్యధిక ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలోనే ఉంటాయని అంచనా వేస్తున్నారు నిపుణులు.
50 వాహనాలు ఢీ..
మంచు తుపాను ప్రభావంతో సోమవారం ఉదయం అయోవా రాష్ట్రంలోని ఇంటర్‌స్టేట్ 80 రహదారిలో సుమారు 50 వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. హిమపాతంతో దారి కనిపించక ఒకదాని వెంట ఒకటి ఢీ కొట్టాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదాల కారణంగా రహదారిని మూసివేశారు అధికారులు.
ఇదీ చూడండి: పౌరసత్వ బిల్లు ఆమోదం పొందితే షాపై అమెరికా ఆంక్షలు!