ప్రపంచ దేశాలను కరోనా వైరస్ గడగడలాడిస్తోంది. ఈ నేపథ్యంలో పలు దేశాలు నియంత్రణ చర్యలు చేపడుతున్నాయి. తమ దేశానికి వచ్చే విదేశీ ప్రయాణికులు 14రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలని ఆస్ట్రేలియా స్పష్టం చేసింది. కరోనా నియంత్రణకు ఈ చర్యలు తప్పవని ఆదేశ ప్రధాని స్కాట్ మోరిసన్ చెప్పారు.
అమెరికా ఆంక్షల విస్తరణ..
ఇప్పటికే పలు ఐరోపా దేశాలపై ప్రయాణ ఆంక్షలు విధించిన అమెరికా.. ఇప్పుడు బ్రిటన్, ఐర్లాండ్ దేశాలకూ వర్తింపజేసింది. కరోనాపై సమీక్ష నిర్వహించిన అనంతరం డొనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిబంధనలు సోమవారం నుంచి అమల్లోకి రానున్నట్లు అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ తెలిపారు. అగ్రరాజ్యంలో కరోనాతో 55మంది మరణించగా, 2500మందికి వైరస్ సోకినట్లు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇదీ చూడండి: కరోనాపై పోరుకు నేడు సార్క్ దేశాధినేతల వీడియో కాన్ఫరెన్స్