ETV Bharat / international

aukus pact: 'ఆకస్​' కూటమిపై చైనా- ఫ్రాన్స్​ ఆగ్రహం - అమెరికా బ్రిటన్​ ఆకస్​

ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనాకు చెక్‌ పెట్టేందుకు ఏర్పడిన త్రైపాక్షిక రక్షణ కూటమిపై(aukus alliance) అంతర్జాతీయంగా పలుదేశాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. చైనా, ఫ్రాన్స్‌ ఈ కూటమి ఏర్పాటును వ్యతిరేకిస్తున్నాయి. ఆస్ట్రేలియా అణుజలాంతర్గాముల(aukus australia) తయారీకి సహకారం అందించడం.. అణునిరాధీకరణకు వ్యతిరేకమని చెప్పాయి. అటు.. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని పెంచాలనే లక్ష్యంతోనే కూటమిగా ఏర్పడినట్లు ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్‌ స్పష్టం చేశాయి.

AUKUS
ఆకస్​
author img

By

Published : Sep 17, 2021, 3:37 PM IST

ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో చైనాకు ముకుతాడు వేసేందుకు క్వాడ్‌కు అదనంగా ఏర్పాటైన ఆకస్ కూటమిపై(aukus alliance) చైనా, ఫ్రాన్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ కూటమి ఏర్పాటును తీవ్రంగా విమర్శించిన చైనా.. ఈ ఒప్పందాన్ని ప్రాంతీయ స్థిరత్వానికి ముప్పుగా, అంతర్జాతీయ అణు నిరాయుధీకరణ చర్యలకు విఘాతంగా అభివర్ణించింది. కూటమి చర్యలు ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీస్తుందని చైనా విమర్శించింది. ఆస్ట్రేలియా అణ్వాయుధ దేశం కాదని.. ఇప్పుడు అణు జలాంతర్గామి తయారు చేయడానికి సిద్ధపడుతోందని తెలిపింది(aukus australia). ఇది అణు నిరాయుధీకరణ లక్ష్యాన్ని దెబ్బతీస్తుందని చైనా విదేశాంగ శాఖ ఆరోపించింది(aukus china response). ఆయుధాల కొనుగోళ్లు పెరుగుతాయని హెచ్చరించింది. చైనా ఎదురుదాడిలో చనిపోయేది ఆస్ట్రేలియా సైనికులే కావచ్చని చైనా ప్రభుత్వానికి చెందిన గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. ఆకస్‌ కూటమి ఒప్పందం క్రూరమైన ఏకపక్ష నిర్ణయమని ఫ్రాన్స్‌ ఆరోపించింది. ఈ నిర్ణయంతో వాషింగ్టన్‌లో హాజరవ్వాల్సి ఉన్న ఒక కార్యక్రమాన్ని ఫ్రాన్స్ దౌత్యవేత్తలు రద్దు చేసుకున్నారు.

అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌ కలిసి ఆకస్ పేరుతో భద్రతా కూటమిగా ఏర్పడ్డాయి. బుధవారం జరిగిన వర్చువల్ సమావేశంలో.. ఆకస్ కూటమిని ఏర్పాటు చేస్తున్నట్లు ఈ మూడు దేశాలు ప్రకటించాయి. ఈ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్, ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మారిసన్ పాల్గొన్నారు. ఐతే ఎక్కడా చైనా పేరును ప్రస్తావించలేదు. ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో స్థిరత్వం కోసం ఈ మూడు దేశాలు తమ రక్షణ సామర్థ్యాలతో పాటు కృత్రిమ మేధ, సైబర్‌ సెక్యూరిటీ వనరులను పరస్పరం పంచుకోనున్నాయి(aukus pact). అణుశక్తితో నడిచే జలాంతర్గాముల తయారీలో ఆస్ట్రేలియాకు అమెరికా, బ్రిటన్‌ సాయం చేయనున్నాయి. రక్షణ సంబంధింత శాస్త్ర, సాంకేతికత, పారిశ్రామిక స్థావరాలు, సరఫరా గొలుసులను బలోపేతం చేసేందుకు ఆమోదం తెలిపాయి. ఆకస్‌ కార్యాచరణను 18 నెలల్లో రూపొందించనున్నారు. అటు.. ఆకస్ కూటమిపై చైనా విమర్శలను అస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ తోసిపుచ్చారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని పెంచాలని ఆస్ట్రేలియా కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆకస్ కూటమి పట్ల సింగపూర్ విదేశాంగ మంత్రిత్వశాఖ సానుకూలంగా స్పందించింది. ఈ ఒప్పందం అమెరికా-ఫ్రాన్స్‌ సంబంధాలపై ప్రభావం చూపబోదని, అసలు ఈ కూటమి ఏ దేశానికి వ్యతిరేకం కాదని అమెరికా శ్వేతసౌధం తెలిపింది.

ఇండో పసిఫిక్‌లో చైనాకు చెక్‌ పెట్టేందుకే గతంలో క్వాడ్‌ భద్రతా కూటమి ఏర్పడింది. ఇందులో భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లు ఉన్నాయి. క్వాడ్రిలేటరల్‌ సెక్యూరిటీ డైలాగ్‌-క్వాడ్‌ సమావేశం ఈ నెల 24న జరుగనుంది(quad summit 2021). క్వాడ్‌ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, భారత ప్రధాని మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని మారిసన్‌, జపాన్‌ ప్రధాని యోషిహిడే సుగా హాజరుకానున్నారు. సమావేశానికి వారం రోజుల ముందు అదే లక్ష్యంతో కొత్త ఆకస్‌ కూటమిని ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదీ చూడండి:- చైనాకు దీటుగా.. ఆ మూడు దేశాల కొత్త కూటమి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.