దక్షిణ పెరూలోని అయాకుచోలో ఓ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 27 మంది మృతి చెందారు. మరి కొంత మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక నాస్కాలోని ఆస్పత్రికి తరలించారు. బస్సులో చిన్న పిల్లలతో పాటు చాలా మంది మహిళలు కూడా ఉన్నారు.
అక్కడి కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో.. బస్సు 250 మీటర్ల లోయలో పడింది. అయాకుచో ప్రాంతం నుంచి అరెక్విపా వెళ్తుండగా ఇంటర్‌సోనిక్ హైవేపై ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: కాల్పుల కలకలం- ఒకరు మృతి, 12 మందికి గాయాలు