పెరూలోని సిహువాస్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు బోల్తా పడిన ఘటనలో కనీసం 20 మంది మరణించారు. మరో 14 మంది క్షతగాత్రులయ్యారని అధికారులు తెలిపారు.
తమ దేశంలో జరుగుతున్న సాధారణ ఎన్నికల్లో ఓటు వేసి.. పరొబంబా జిల్లా నుంచి లీమా వైపు వస్తున్న ప్రయాణికుల బస్సు ఒక్కసారిగా బోల్తా పడిందని స్థానిక రేడియో స్టేషన్ పేర్కొంది. పరొబంబా జిల్లా అధికారిక ఫేస్బుక్ పేజీ ప్రకారం.. 18 మంది అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు ఆసుపత్రికి తీసుకువెళుతుండగా మృతి చెందారు.
సహాయక చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: మెగసెసె అవార్డు గ్రహీత రెహమాన్ కన్నుమూత