అంతరిక్షంలో రేడియేషన్, అసాధారణ ఉష్ణోగ్రతల నుంచి మనుషులను రక్షించేందుకు మరో ముందడుగు పడింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో వ్యోమగాములు తొలి సారి భార రహిత స్థితిలో విజయవంతంగా సిమెంట్‌ను మిక్స్ చేశారు.
భార రహిత స్థితి ఉన్నప్పుడు సిమెంట్ గట్టిపడే ప్రక్రియలో రసాయన, మైక్రోస్కోపిక్ నిర్మాణాలు ఎలా ఉంటాయో పరిశోధకులు అధ్యయనం చేశారు.
ఈ ప్రయోగాన్ని మైక్రోగ్రావిటీ ఇన్వెస్టిగేషన్ సిమెంట్ సాలిడిఫికేషన్ (ఎమ్ఐసీఎస్)గా నాసా పిలుస్తోంది. భూమి గురుత్వాకర్షణకు వెలుపల ట్రైకాల్సియమ్ సిలికేట్‌ను, నీరుతో కలపడం ఇదే తొలిసారని పేర్కొంది. చంద్రుడు, అంగారకుడిపైకి మనుషులు వెళ్లినప్పుడు అక్కడ సురక్షితంగా పనిచేసుకునేందుకు తగిన నిర్మాణాలను చేపట్టేందుకు ఈ సిమెంట్ ఉపకరిస్తుందని వెల్లడించింది.
ఇదీ చూడండి: పీఓకేలో... కశ్మీర్‌పై ఇమ్రాన్‌ఖాన్ 'విధాన ప్రకటన'