అమెరికాలో ఆస్ట్రాజెనికా- ఆక్స్ఫర్డ్ టీకా(ఏజెడ్‌డీ1222) క్లినికల్ ట్రయల్స్ తిరిగి ప్రారంభమయ్యాయి. అగ్రరాజ్య ఎఫ్‌డీఏ(ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) అనుమతుల అనంతరం చర్యలు చేపట్టినట్టు ఆస్ట్రాజెనికా సంస్థ ప్రకటించింది.
"కొన్ని వారాల ముందు ఆస్ట్రాజెనికా టీకా ప్రయోగాలను ప్రపంచవ్యాప్తంగా పునరుద్ధరించాం. తాజాగా.. అమెరికాలో టీకా పరీక్షలకు ఎఫ్‌డీఏ అనుమతులిచ్చింది. భద్రతా డేటాను సమీక్షించిన అనంతరం.. టీకా ప్రయోగాలను పునఃప్రారంభించడమే సురక్షితమని తేలిన తర్వాతే అనుమతినిచ్చింది."
--- ఆస్ట్రాజెనికా ప్రకటన.
వ్యాక్సిన్ తీసుకున్న ఓ వలంటీర్ అస్వస్థతకు గురైన నేపథ్యంలో గత నెల 3న ప్రపంచవ్యాప్తంగా టీకా ప్రయోగాలకు బ్రేక్ పడింది. సమస్యను పరిశీలించిన ఆక్స్ఫర్డ్.. ఆ వ్యక్తిలో తలెత్తిన అనారోగం.. టీకా వల్ల అయ్యుండకపోవచ్చని తెలిపింది. అనంతరం ప్రపంచవ్యాప్తంగా టీకా ప్రయోగాలు మళ్లీ షురూ అయ్యాయి.
ఇదీ చూడండి:- 'ఆ వలంటీర్ ఆస్ట్రాజెనికా టీకా వల్ల చనిపోలేదు'!