Anti vaccine protest: కెనడాలో వ్యాక్సిన్ వ్యతిరేక ఆందోళనలు మిన్నంటాయి. పెద్ద సంఖ్యలో నిరసనకారులు రాజధాని ఒట్టావాలో ర్యాలీ నిర్వహించారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో సహా ఆయన కుటుంబాన్ని రహస్య ప్రాంతానికి తరలించారు.
Covid rules protest Canada
రాష్ట్రాల సరిహద్దులు దాటే ట్రక్కు డ్రైవర్లకు టీకా తప్పనిసరి అనే నిబంధనను అధికారులు అమలు చేస్తున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నారు. 'ఫ్రీడమ్ కాన్వాయ్' పేరుతో ఆందోళనలకు దిగారు. వీరితో పాటు టీకా తప్పనిసరి నిబంధనను వ్యతిరేకిస్తూ ఇతరులు సైతం నిరసనల్లో పాల్గొంటున్నారు.
కొంతమంది నిరసనకారులు చిన్నారులను సైతం వెంటతెచ్చుకున్నారు. ప్రధానికి వ్యతిరేకంగా తీవ్రమైన పదప్రయోగాలు చేశారు. మరికొందరు జాతీయ యుద్ధస్మారకం వద్ద నృత్యాలు చేశారు. నిరసనకారుల తీరును కెనడా అత్యున్నత సైనికాధికారి వేన్ ఐర్, రక్షణ మంత్రి అనితా ఆనంద్ తీవ్రంగా ఖండించారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: రెండు దేశాల మధ్య యుద్ధవాతావరణం.. ఆ అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు