ETV Bharat / international

అమెరికాలో సిక్కు యువతి సరికొత్త చరిత్ర

author img

By

Published : Jun 14, 2020, 6:38 AM IST

ప్రపంచ ప్రఖ్యాత అమెరికన్​ మిలిటరీ అకాడమీలో చేరడమంటేనే అదో గొప్ప అనుభూతి. అలాంటిది.. సైనిక విభాగంలో చేరిన ఓ సిక్కు మహిళ.. ఇప్పుడు గ్రాడ్యుయేట్​ పట్టా సాధించారు. శనివారం అక్కడ జరిగిన స్నాతకోత్సవంలో అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ చేతుల మీదుగా పట్టా అందుకున్నారు అన్మోల్​.

Anmol Narang becomes first observant Sikh to graduate from US Military Academy
అమెరికన్ మిలటరీ అకాడమిలో తొలి సిక్కు మహిళా గ్రాడ్యుయేట్!

భారత ఆర్మీ విభాగంలో సేవలందించిన తన తాతయ్యను స్ఫూర్తిగా తీసుకున్నారో మహిళ. ఆయన ప్రోత్సాహంతోనే సైనిక సేవలపై అభిమానం పెంచుకొని... పాఠశాల స్థాయి నుంచే ఆ దిశగా ప్రయత్నాలు సాగించారు. ఈ క్రమంలోనే యూఎస్​ మిలిటరీ అకాడమీలో చేరారామె. ఇప్పుడు ఏకంగా పట్టభద్రురాలై.. ఈ విభాగంలో గ్రాడ్యుయేట్​ పట్టా​ పొందిన తొలి సిక్కు మహిళగా చరిత్ర సృష్టించారు అన్మోల్​ నారంగ్​. ఇప్పటికే ఆమె సైన్యంలో సెకండ్​ లెఫ్టినెంట్​ హోదాలో ఉన్నారు.

ప్రతిష్ఠాత్మక యూఎస్​ సైనిక శిక్షణా కేంద్రంలో పట్టభద్రురాలైన నారంగ్​ శనివారం జరిగిన స్నాతకోత్సవంలో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ చేతుల మీదుగా పట్టా అందుకున్నారు.

'వెస్ట్​ పాయింట్​ నుంచి గ్రాడ్యుయేషన్​ పొందాలనే నాకల నెరవేరింది. ఇందుకు చాలా గర్వపడుతున్నాను. ఇదే విశ్వాసంతో అమెరికన్​ సిక్కులు ఎదుర్కొనే సవాళ్లను అధిగమించేందుకు నా వంతు కృషి చేస్తాను.'

- అన్మోన్​ నారంగ్​

ఇదీ చదవండి: 'చోక్‌హోల్డ్‌' విధానానికి స్వస్తి పలకండి: ట్రంప్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.