అగ్రరాజ్యం అమెరికాలో మరో జాతి విద్వేష ఘటన జరిగింది. ఉత్తర కరోలినా ప్రాంతంలో ఆసియా వ్యక్తి నిర్వహిస్తున్న ఓ సూపర్ మార్కెట్‌లో ఆగంతుకుడు దాడికి పాల్పడ్డాడు. పెద్ద రాడ్ తీసుకుని సూపర్ మార్కెట్లోకి చొచ్చుకువచ్చిన దుండగుడు అక్కడి ఫర్నీచర్‌ను ధ్వంసం చేశాడు. అతడి చర్యను చూసి అక్కడ ఉన్న వారు భయంతో పరుగులు తీశారు. దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
'150 శాతం పెరిగాయి'
గత వారంలోనూ ఇలాంటి ఘటన జరిగినట్లు మార్కెట్ యజమాని వివరించారు. 'మీ దేశానికి వెళ్లిపోండి' అని కొందరు వ్యక్తులు అవమానించారని తెలిపారు.
గతనెల అట్లాంటాలో ఎనిమిది మందిని కాల్చి చంపారు. అందులో ఆరుగురు ఆసియాకు చెందినవారే. కరోనా సమయంలో జాతి విద్వేష ఘటనలు 150 శాతం పెరిగినట్లు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం జరిపిన అధ్యయనాల్లో తేలింది.
ఇదీ చదవండి : గృహ నిర్బంధంలో జోర్డాన్ మాజీ యువరాజు!