ETV Bharat / international

బాలుడ్ని రేప్​ చేసిన టీచరమ్మకు 20ఏళ్ల జైలు

అమెరికాలోని ఆరిజోనా రాష్ట్రంలో ఓ ఉపాధ్యాయురాలు బరితెగించింది. విద్యార్థి అన్న విచక్షణ మరచి 13 ఏళ్ల బాలుడిపై అఘాయిత్యానికి పాల్పడింది. నిజం బయటకు పొక్కగా ఆమెకు 20 ఏళ్ల జైలుశిక్ష పడింది.

బాలుడ్ని రేప్​ చేసిన టీచరమ్మకు 20ఏళ్ల జైలు
author img

By

Published : Jul 13, 2019, 4:47 PM IST

Updated : Jul 13, 2019, 5:36 PM IST

బాలుడ్ని రేప్​ చేసిన టీచరమ్మకు 20ఏళ్ల జైలు

లైంగిక దాడి అంశమై బాలికలే కాదు... బాలుర విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది అమెరికాలో జరిగిన ఓ ఘటన. బడికి వచ్చిన విద్యార్థులకు పాఠాలు చెప్పి మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయురాలే దారి తప్పింది. విచక్షణ కోల్పోయి విద్యార్థులతో తప్పుడు పనులు చేసింది. ఆమె చేసిన పనితో చిన్నారుల భవిష్యత్తుపై పడే ప్రభావాన్ని, సమాజానికి జరిగే చెడును దృష్టిలో ఉంచుకుని 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది అమెరికా కోర్టు.

బ్రిటానీ ఆన్ జమోరా... ఆరిజోనా రాష్ట్రం గుడ్ ఇయర్ ప్రాంతంలోని లాస్ బ్రిసాస్ అకాడమిలో ఉపాధ్యాయురాలు. వయస్సు 28 ఏళ్లు. పాఠశాలలోని 13 ఏళ్ల విద్యార్థితో అనేక సార్లు శృంగారంలో పాల్గొందని ఆమెపై ఉన్న ఆరోపణ. టీచరమ్మ ఈ అకృత్యాన్ని మరో 11 ఏళ్ల బాలుడి సమక్షంలో కొనసాగించిందని అధికారులు నిర్ధరించారు. ఈ ఇద్దరు విద్యార్థులకు నగ్న చిత్రాలను పంపిందని సమాచారం. మరోసారి తరగతి గదిలోనే అసహజ కృత్యాలకు పాల్పడిందని నిందితురాలిపై ఆరోపణలు ఉన్నాయి.

బాలుడిపై లైంగిక దాడి, అసహజ శృంగారం, బహిరంగ లైంగిక అసభ్యత కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆమెకు 27 ఏళ్లపాటు శిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ వారు వాదించారు. నిందితురాలి తరఫు వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి... జమోరాకు 20 ఏళ్ల శిక్ష విధించారు.

నిందితురాలు జమోరాపై ఉన్న మరో 12 నేరపూరిత ఆరోపణలను న్యాయమూర్తి కొట్టేశారు.

ఇదీ చూడండి: ఔరా: యోగాతో 'పక్షి రాజు' తిరుగులేని సందేశం

AP Video Delivery Log - 1000 GMT News
Saturday, 13 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0903: Hong Kong Protest AP Clients Only 4220241
Protest against Hong Kong cross-border traders
AP-APTN-0816: Venezuela Guaido AP Clients Only 4220239
Venezuelan opposition leader Guaido in Trujillo
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jul 13, 2019, 5:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.