ETV Bharat / international

జంతువు నుంచి కొవిడ్ యాంటీబాడీల సేకరణ - కరోనా వ్యాక్సీన్​ పరిశోధన

లామా అనే జంతువు నుంచి కొవిడ్​ను నివారించే యాంటీబాడీలను విజయవంతంగా సేకరించారు శాస్త్రవేత్తలు. పిట్స్​బర్గ్ విశ్వవిద్యాలయ శాస్త్రజ్ఞులు ఈ పరిశోధన చేశారు.

COVID_ANTI BODIES
'కొవిడ్​-19ను నివారించే సరికొత్త యాంటీబాడీలు'
author img

By

Published : Nov 7, 2020, 7:29 AM IST

కరోనా వైరస్​పై పోరాడే సామర్థ్యమున్న శక్తిమంతమైన యాంటీబాడీలను సేకరించే సరికొత్త విధానాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. లామా అనే జంతువు నుంచి వీటిని విజయవంతంగా సేకరించారు. దీంతో కొవిడ్-19ను నివారించే, చికిత్స చేసేందుకు శ్వాస ద్వారా తీసుకోదగ్గ ఔషధాల తయారీకి మార్గం సుగుమమైందని వారు తెలిపారు.

అమెరికాలోని పిట్స్​బర్గ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. ఈ ప్రత్యేక యాంటీబాడీలు చాలా చిన్నగా ఉన్నాయి. అందువల్ల వాటిని నానోబాడీలుగా పేర్కొంటున్నారు. ఇవి మానవుల్లోని యాంటీబాడీల కన్నా చాలా చిన్నగా ఉంటాయి.

రెండు నెలల తర్వాత..

పరిశోధనలో భాగంగా లామాలోకి కరోనా వైరస్​కు సంబంధించిన స్పైక్​ ప్రోటీన్​ను శాస్త్రవేత్తలు చొప్పించారు. రెండు నెలల తర్వాత ఆ జంతువులోని రోగ నిరోధక వ్యవస్థ... పరిపక్వ నానోబాడీలను ఉత్పత్తి చేసింది. ఇవి కరోనా వైరస్​కు చాలా బలంగా అతుక్కుంటాయని గుర్తించారు. నానోగ్రాము పరిమాణంలోని నానోబాడీలను భారీగా వైరస్​లను నిర్వీర్యం చేయచ్చని వివరించారు.

మానవ శరీరంలోని 10 లక్షల కణాలను కరోనా ఇన్​ఫెక్షన్ బారినపడకుండా కాపాడటానికి ఈ పరిణామం ఉపయోగపడుతుందన్నారు పరిశోధకులు. సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద ఇవి ఆరు వారాల పాటు స్థిరంగా ఉండగలవని తెలిపారు.

ఇదీ చదవండి:నీవూ అధ్యక్షురాలివి కావొచ్చు: కమలా హారిస్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.