పశ్చిమాసియా(Middle East News) సముద్ర తీరంలోని కీలకమైన మారిటైం చోక్ పాయింట్స్(సముద్రంలోని రవాణా మార్గాలు) మీదగా అమెరికాకు చెందిన బీ-1బీ ఎయిర్‌క్రాఫ్ట్ బాంబర్ వెళ్లినట్లు ఆ దేశ ఎయిర్‌ఫోర్స్ సంస్థ ప్రకటించింది. ఇరాన్- అమెరికా(US Iran Nuclear Deal) మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పశ్చిమాసియా దేశాలపై బాంబర్ దూసుకెళ్లటం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ ఘటనపై అమెరికా నావికాదళ సెంట్రల్ కమాండ్ ట్వీట్ చేసింది. బీ-1బీ ఎయిర్‌క్రాఫ్ట్ బాంబర్‌ను పంపించి మిత్ర దేశాలకు బైడెన్ భరోసా కల్పిస్తున్నారని తెలిపింది. బీ-1బీ ఎయిర్‌క్రాఫ్ట్ బాంబర్.. దక్షిణ డకోటాలోని 37వ బాంబ్ స్క్వాడ్రన్ నుంచి వచ్చింది.
బీ-1బీ ఎయిర్‌క్రాఫ్ట్ బాంబర్.. హార్ముజ్ స్ట్రెయిట్, ఎర్రసముద్రం, ఈజిప్టులోని సూయజ్ కాలువ మీదగా ప్రయాణించింది. ప్రపంచవ్యాప్తంగా 20శాతం ముడిచమురు వ్యాపార వాణిజ్యానికి హార్ముజ్ స్ట్రెయిట్ కేంద్ర బిందువుగా ఉంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం క్రమంలో స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్, ఎర్రసముద్రంలోని వాణిజ్య స్థావరాలపై వరుస దాడులు జరిగాయి. అయితే ఈ దాడులకు తమకు ఎలాంటి సంబంధం లేదని ఇరాన్(US Iran Nuclear Deal) స్పష్టం చేసింది.
సుముఖంగా బైడెన్..
మరోవైపు ఇరాన్‌తో 2015 నాటి అణు ఒప్పందాన్ని(US Iran Nuclear Deal) పునరుద్ధరించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సుముఖంగా ఉన్నారు. అణు కార్యక్రమం విషయంలో నెలకొన్న విభేదాలను పరిష్కరించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు శ్వేతసౌధం ఇటీవల వెల్లడించింది.
ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2015లో ఇరాన్‌తో కుదిరిన అణు ఒప్పందం(US Iran Nuclear Deal) నుంచి 2018లో ట్రంప్ హయాంలో అమెరికా వైదొలిగింది.
ఇదీ చూడండి: 'లావా' బీభత్సం.. 2 వేల ఎకరాల్లో పంట నాశనం