ETV Bharat / international

బెజోస్‌తో అంతరిక్ష ప్రయాణానికి అన్ని కోట్లా! - అమెజాన్ వ్యవస్థాపకుడు ఎవరు?

అపర కుబేరుడు, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ వచ్చే నెల చేపట్టనున్న అంతరిక్ష యాత్రలో ఆయనతో పాటు ప్రయాణించే వ్యక్తిని వేలం నిర్వహించి మరీ ఎంపిక చేశారు. ఇందుకోసం సదరు వ్యక్తి 2.80కోట్ల డాలర్లు చెల్లించడం విశేషం. అయితే ఆ వ్యక్తి ఎవరనేది ఇప్పుడే చెప్పలేమంటోంది బ్లూ ఆరిజిన్ అనే అంతరిక్ష సంస్థ.

jeff bezos
జెఫ్​ బెజోస్‌
author img

By

Published : Jun 14, 2021, 6:37 AM IST

Updated : Jun 14, 2021, 6:49 AM IST

అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, ఆయన సోదరుడితో కలిసి అంతరిక్షంలో విహరించే అవకాశం ఎవరికి దక్కనుందనే అంశంపై ఆసక్తి నెలకొంది. ఇందుకోసం నిర్వహించిన వేలం ప్రక్రియ శనివారంతో ముగియగా.. 2.80 కోట్ల డాలర్లకు బిడ్ దాఖలు చేసిన వ్యక్తిని అదృష్టం వరించింది. అయితే ఆ వ్యక్తి పేరును బ్లూ ఆరిజిన్‌ సంస్థ వెల్లడించలేదు. అంతరిక్ష యాత్ర ప్రారంభమయ్యేందుకు కొద్ది రోజుల ముందు ఆ వివరాలు వెల్లడించనున్నారు.

అంతరిక్షంలో విహరించే అవకాశం కోసం శుక్రవారం నాటికి 159 దేశాలకు చెందిన సుమారు 7500 మంది ఆన్‌లైన్‌ ద్వారా నమోదు చేసుకున్నారు. వీరిలో అత్యధిక ధరకు బిడ్‌ దాఖలు చేసిన 20 మంది బిడ్డర్లతో శనివారం వేలం ప్రక్రియ నిర్వహించారు. ఈ వేలంలో 2.80 కోట్ల అమెరికన్‌ డాలర్లకు బిడ్‌ దాఖలు చేసిన వ్యక్తికి అంతరిక్ష యానం చేసే అరుదైన అవకాశం లభించింది. బిడ్డింగ్‌ మొత్తాన్ని బ్లూ ఆరిజిన్‌ ఫౌండేషన్‌, క్లబ్‌ ఫర్‌ ది ఫ్యూచర్‌కు విరాళంగా అందించనుంది. సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యాథ్స్‌ రంగాలకు సంబంధించిన కెరీర్‌లను ఎంచుకునేలా భావితరాల్లో స్ఫూర్తినింపేందుకు అంతరిక్షంలో జీవనానికి సంబంధించిన పరిశోధనలకు ఈ నిధులు వినియోగిస్తారు.

ఇదీ చదవండి: ప్రపంచ రారాజు.. అపర కుబేరుడు.. జెఫ్ బెజోస్‌

అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ సొంత సంస్థ అయిన బ్లూ ఆరిజిన్‌ వచ్చే నెలలో తొలిసారిగా మానవ సహిత రోదసీ యాత్ర చేపట్టనుంది. బ్లూ ఆరిజిన్‌కు చెందిన వ్యోమ నౌక న్యూ షెపార్డ్‌ జులై 20న టెక్సాస్‌ నుంచి నింగికి ఎగరనుంది. జెఫ్‌ బెజోస్‌, ఆయన సోదరుడు మార్క్‌ వ్యోమగాములతో కలిసి బిడ్డింగ్‌లో గెలుపొందిన వ్యక్తి అంతరిక్షయానం చేయనున్నారు. పది నిమిషాలపాటు ఈ యాత్ర సాగుతుంది. అంతరిక్షంలోకి వెళ్లి సురక్షితంగా నౌక తిరిగి వస్తుందో? లేదో పరిశీలించేందుకు 15 యాత్రలను ఇప్పటికే విజయవంతంగా పూర్తిచేసినట్లు మే నెలలో బ్లూ ఆరిజిన్‌ ప్రకటించింది. ఈ యాత్ర ద్వారా అంతరిక్ష పర్యాటకానికి అడుగులు పడతాయని నిపుణులు పేర్కొంటున్నారు.

ఇవీ చదవండి: Amazon: వీరివి అత్యంత ఖరీదైన విడాకులు!

సీఈఓగా జులై 5న తప్పుకోనున్న బెజోస్

Last Updated : Jun 14, 2021, 6:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.