అమెరికాలో మరోసారి తుపాకీ గుళ్లు రక్తం పారించాయి. న్యూ మెక్సికో నగరంలో పలుచోట్ల దుండగులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మరణించగా, మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ భయంకరమైన ఘటనతో ఆల్బూకర్క్ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
ఆల్బూకర్క్ ప్రాంతంలోని వివిధ చోట్ల 90 నిమిషాల వ్యవధిలో ఈ కాల్పులు జరిగాయి. ఈ ఘటనలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే ఇప్పటి వరకు కాల్పులకు కారణం తెలియరాలేదు. ఎవరినీ అరెస్టు చేయలేదు.
దుండగుల చర్య అత్యంత భయంకరమైనదని మేయర్ టిమ్ కెల్లర్ వ్యాఖ్యానించారు. నేరాలను అరికట్టేందుకు చర్యలు చేపడతామని ఆయన పేర్కొన్నారు.
అక్కడ క్రైమ్ రేటు ఎక్కువే..
మెక్సికో నగరంలో నేరాలు సర్వసాధారణమే. తరచుగా దొంగతనాలు, దోపీడీలు జరుగుతుంటాయి. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 32 హత్యలు జరిగాయి. 2018లో 92 సార్లు తుపాకీ కాల్పులు జరిగి.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే గత ఆరు మాసాలుగా ఇక్కడ క్రైమ్ రేటు తగ్గిందని పోలీసులు చెబుతున్నారు.
ఇదీ చూడండి: దంతెవాడలో ఎన్కౌంటర్- ఇద్దరు నక్సల్స్ హతం