ETV Bharat / international

రైతుల ఆందోళనలకు గ్రెటా, రిహానా​ మద్దతు - రైతులపై రిహానా ట్వీట్

దిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతులకు అంతర్జాతీయ స్థాయిలో మద్దతు పెరుగుతోంది. పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్​బర్గ్, పాప్ సింగర్ రిహానా, కమలా హారిస్ బంధువు మీనా.. రైతులకు మద్దతుగా ప్రకటనలు చేశారు. అంతర్జాలం నిలిపివేయడాన్ని తప్పుబట్టారు. భారత్​లో పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు అమెరికా విదేశీ వ్యవహారాల కమిటీ సభ్యుడు జిమ్ కోస్టా తెలిపారు.

after-riri-greta-thunberg-others-extend-support-to-farmers-protest
రైతులకు అంతర్జాతీయ మద్దతు- గ్రెటా, రిహానా ట్వీట్లు
author img

By

Published : Feb 3, 2021, 12:03 PM IST

Updated : Feb 3, 2021, 12:15 PM IST

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో దాదాపు 70 రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులకు అంతర్జాతీయంగా విశేష మద్దతు లభిస్తోంది. తాజాగా ప్రముఖ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్​బర్గ్ కూడా సంఘీభావం తెలిపారు. రైతు ఆందోళనకు తన పూర్తి మద్దతు ఉంటుందని ట్వీట్‌ చేశారు.

"భారత్​లో జరుగుతున్న రైతుల నిరసనకు మేం సంఘీభావం తెలుపుతున్నాం."

-గ్రెటా థన్​బర్గ్, పర్యావరణ ఉద్యమకారిణి

అంతకుముందు ప్రముఖ గాయని రిహానా సైతం రైతులకు మద్దతుగా ట్వీట్ చేశారు. దిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు ఆందోళన చేస్తున్న ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను రద్దు చేసిన కథనాన్ని షేర్ చేశారు. ఈ విషయంపై మనం ఎందుకు మాట్లాడటం లేదంటూ ప్రశ్నించారు.

రిహానా ట్వీట్​కు స్పందించిన యూకే పార్లమెంట్ సభ్యురాలు క్లాడియా వెబ్బే.. రాజకీయ నాయకత్వలేమి నెలకొన్న ప్రస్తుత సమయంలో ఇతరులు ముందుకు రావడం గొప్పవిషయమని కొనియాడారు.

మీనా హారిస్

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ బంధువు మీనా హారిస్ సైతం రైతులకు మద్దతుగా ట్వీట్ చేశారు. అంతర్జాలాన్ని నిలిపివేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులపై పారామిలిటరీ సిబ్బంది దాడిని ఖండించారు. 'ప్రపంచంలోని పురాతన ప్రజాస్వామ్యంపై దాడి జరిగి నెలరోజులు తిరగకముందే.. అతిపెద్ద ప్రజాస్వామ్యం దాడికి గురైంద'ని వ్యాఖ్యానించారు. 'నియంతృత్వ నిరంకుశవాదులు' ఇంకా ఉన్నారని గుర్తిస్తేనే ఇలాంటి వాటిని ఆపగలరని పేర్కొన్నారు.

after-riri-greta-thunberg-others-extend-support-to-farmers-protest
మీనా హారిస్ ట్వీట్

మరోవైపు, భారత్​లో జరుగుతున్న నిరసనలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు అమెరికా విదేశీ వ్యవహారాల కమిటీ సభ్యుడు, రిపబ్లికన్ నేత జిమ్ కోస్టా తెలిపారు. శాంతియుతంగా నిరసన చేసే హక్కును గౌరవించాలని హితవు పలికారు.

Last Updated : Feb 3, 2021, 12:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.