ETV Bharat / international

ఎయిర్​ ఫోర్స్​ వన్​ స్థావరంలోకి చొరబాటు! - ఉపాధ్యక్షురాలి విమానం

ఎయిర్‌ఫోర్స్‌ వన్‌గా పిలిచే అమెరికా.. దేశాధ్యక్షుడి విమానంలోకి ప్రవేశించేందుకు ఒక దుండగుడు విఫలయత్నం చేశాడు. అయితే ఉపాధ్యక్షురాలి విమానంలోకి ప్రవేశించిన అతన్ని అమెరికా రక్షణ శాఖ అదుపులోకి తీసుకుంది. ఈ ఘటన కలకలం సృష్టించింది.

AIRFORCE ONE
కమలా హారిస్​ విమానంలోకి దుండగుడు!
author img

By

Published : Feb 7, 2021, 7:26 AM IST

అమెరికాలో అధ్యక్షుడి విమానం 'ఎయిర్​ ఫోర్స్ వన్', ఉపాధ్యక్షురాలు, ఇతర ప్రముఖులు ఉపయోగించే లోహవిహంగాలను నిలిపే 'జాయింట్ బేస్​ ఆండ్రూస్​' వైమానిక స్థావరంలోకి ఓ చొరబాటుదారుడు ప్రవేశించడం కలకలం సృష్టించింది. అంతేకాదు.. ఉపాధ్యక్షురాలు ఉపయోగించే 'సి-40బి' విమానంలోకి కూడా అతడు ప్రవేశించాడు.

ఆయుధాలు లేవు..

ఎయిర్​ బేస్​లోకి ప్రవేశించినా.. అధ్యక్షుడు వాడే విమానాల వద్దకు అతడు చేరుకోలేదని అధికారులు వివరించారు. దుండగుడి వద్ద ఎలాంటి ఆయుధాలు లేవని చెప్పారు. అతడిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. అమెరికా అధ్యక్ష భవనం.. వైట్​హౌస్​కు 24 కిలోమీటర్ల దూరంలో ఈ స్థావరం ఉంది. తాజా ఉదంతాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నట్లు అమెరికా రక్షణ శాఖ మీడియా కార్యదర్శి 'జాన్​ కిర్బీ' శుక్రవారం పేర్కొన్నారు.

ఇదీ చదవండి: 'అమెరికాను బలహీనం చేయడమే చైనా లక్ష్యం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.