ETV Bharat / international

అమెరికాలో పోలీసుల కాల్పులు.. ఏడుగురికి గాయాలు - అమెరికాలో పోలీసు కాల్పుల్లో ఏడుగురు మృతి

shooting
అమెరికాలో పోలీసుల కాల్పులు.. ఏడుగురికి గాయాలు
author img

By

Published : May 29, 2020, 12:06 PM IST

Updated : May 29, 2020, 12:34 PM IST

12:27 May 29

అమెరికాలో పోలీసుల కాల్పులు.. ఏడుగురికి గాయాలు

అమెరికాలో ఓ అంశమై నిరసన చేపడుతున్న వారిని చెదరగొట్టేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఏడుగురికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కెంటుక్కి రాష్ట్రంలోని లూయిస్​ విల్లేలో ఈ ఘటన జరిగింది.  

మార్చిలో పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన ఓ వైద్య విద్యార్థిని మృతికి నిరసనగా ఆందోళన చేపట్టారు నిరసనకారులు. వీరిని చెదరగొట్టేందుకే పోలీసులు కాల్పులు జరిపారు.  

ఇదీ నేపథ్యం..

మాదక ద్రవ్యాల కేసు దర్యాప్తు కోసం మార్చిలో మృతురాలి ఇంటికి వెళ్లిన పోలీసులు తలుపులపై కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో తలుపు వెనక ఉన్న వైద్య విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. నాడు ఇది దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. మృతురాలి తల్లిదండ్రులు పోలీసులపై కేసు పెట్టారు. దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసుల వైఖరికి నిరసనగా మృతురాలి సహచరులు ర్యాలీ తీశారు. ఈ నిరసనల్లోనే తాజా ఘర్షణ చెలరేగింది.

11:55 May 29

అమెరికాలో ప్రజలపైకి పోలీసుల కాల్పులు

అమెరికాలో నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఏడుగురికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మార్చిలో పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన ఓ వైద్య విద్యార్థి మృతికి నిరసనగా ఆందోళన చేపట్టారు నిరసనకారులు. వీరిని చెదరగొట్టేందుకే పోలీసులు కాల్పులు జరిపారు.

Last Updated : May 29, 2020, 12:34 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.