అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో నలుగురు గాయాలపాలయ్యారు. ఈ ఘటన పోకోనో పర్వత ప్రాంతంలో జరిగినట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులందరూ ఒకే తెగకు చెందిన వారిగా గుర్తించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
ఈ ఘటనలో ఓ మహిళపై కాల్పులు జరపగా.. వెన్నులో తూటాలు దిగినట్లు పోలీసులు తెలిపారు. మరో వ్యక్తికి తలలో బులెట్ దిగినట్లు చెప్పారు. వీరిని ప్రస్తుతం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. దుండగుల కోసం గాల్పింపు చేపట్టామని తెలిపారు.
ఇదీ చూడండి: పెలోసీ ల్యాప్టాప్ చోరీ- రష్యాకు విక్రయించే యత్నం!