తుపాకుల సంస్కృతి ఉన్న అమెరికాలో మరోసారి తూటాలు పేలాయి. టెక్సాస్ శాన్ ఆంటోనియోలో జరిగిన ఓ మ్యూజిక్ షోలో చెలరేగిన ఘర్షణ కాల్పులకు దారితీసింది. ఈ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు.
అసలు ఏం జరిగింది?
అమెరికా టెక్సాస్ శాన్ ఆంటోనియోలో ఓ మ్యూజిక్ షోను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అనుకోకుండా వాగ్వాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన ఓ ఆగంతకుడు తుపాకితో కాల్పులు జరపగా, ఒకరు అక్కడికక్కడే మరణించాడు. గాయపడిన ఆరుగురిని ఆసుపత్రికి తరలిస్తుండగా మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇదీ చూడండీ: నిర్భయ దోషి 'మైనర్' పిటిషన్ కొట్టివేత- ఉరే తరువాయి