ETV Bharat / international

తొలి ప్రైవేటు అంతరిక్షయాత్ర.. టికెట్టు ఎంతో తెలుసా? - space crew paying USD 55M each to fly to station

అంతర్జాతీయ అంతరిక్షకేంద్రానికి తొలి ప్రైవేటు వ్యోమనౌక వచ్చే జనవరిలో వెళ్లనుంది. అంతరిక్షయానం కోసం హ్యోస్టన్​కు చెందిన ఓ ప్రవేటు సంస్థ ఒక్కోక్కరి నుంచి ఎంత వసూలు చేస్తోందో తెలుసా?

1st private space crew paying USD 55M each to fly to station
ఇంత భారీ మొత్తం చెల్లిస్తేనే అంతరిక్షయానం!
author img

By

Published : Jan 27, 2021, 4:51 PM IST

మొదటి ప్రైవేట్​ అంతరిక్షయాత్ర వచ్చే జనవరిలో ప్రారంభం కానుంది. ముగ్గురు వ్యక్తులతో కూడిన ఈ బృందానికి నాసా మాజీ వ్యోమగామి నేతృత్వం వహించనున్నారు. అయితే వీరు స్పేస్​కి వెళ్లేందుకు హ్యోస్టన్​కు చెందిన ఆక్సియం సంస్థ భారీగానే వసూలు చేస్తోంది. ఒక్కొక్కరికి నుంచి 55 మిలియన్​ డాలర్లు (రూ.401కోట్లు) వరకు తీసుకోనున్నట్లు సంబంధిత కంపెనీ మంగళవారం ప్రకటించింది.

అయితే ఇలాంటి ప్రైవేటు వ్యోమనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లడం ఇదే మొదటిసారి అని ఆక్సియం సంస్థ అధ్యక్షుడు మైక్ సుఫ్రేది తెలిపారు. మైక్​ నాసాలో అంతరిక్ష కేంద్రం ప్రోగ్రామ్ మేనేజర్​గా కొంతకాలం సేవలందించారు. ఈ బృందంలో మిషన్​ కామాండర్​గా మైఖేల్​ లోపేజ్​ అలెగ్రియాకు అంతరిక్ష ప్రయాణంపై పూర్తి అవగాహన ఉందని మైక్​ తెలిపారు. మిగతా ముగ్గురికి ఇది ఓ మంచి అవకాశం అని వ్యాఖ్యానించారు.

మొదటగా వెళ్లే సిబ్బంది అంతరిక్ష కేంద్రంలో ఎనిమిది రోజులు గడుపుతారని మైక్​ స్పష్టం చేశారు. అయితే వారు కేప్ కెనావెరల్ నుంచి అంతరిక్షంలోకి వెళ్లేందుకు స్పేస్‌ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్‌ ద్వారా ఒకటి నుంచి రెండు రోజులు పట్టనుందని తెలిపారు.

ఇతర గ్రహాలపైకి మానవులను తీసుకుపోయే కార్యక్రమాన్ని రష్యా 2001 నుంచే ప్రారంభించింది.
ఇదీ చూడండి: 'స్పేస్​ ఎక్స్​ మిషన్​-3' కమాండర్​గా రాజా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.