ETV Bharat / international

'కరోనా విషయంలో భారత్​కు మద్దతుగా నిలువొద్దు' - డబ్ల్యూటీఓ

వ్యాక్సిన్​ ముడిపదార్థాల సరఫరాలో భారత్, దక్షిణాప్రికా దేశాలకు మద్దతుగా నిలువకూడదని 12 మంది అమెరికా చట్టసభ్యులు బైడెన్ బృందాన్ని కోరారు. కరోనా నేపథ్యంలో వర్తక సంబంధిత మేథో సంపత్తి హక్కుల (ట్రిప్స్) నిబంధనలను సడలించొచ్చొద్దని విజ్ఞప్తి చేశారు.

joe biden
బైడెన్
author img

By

Published : May 5, 2021, 9:54 AM IST

Updated : May 5, 2021, 12:57 PM IST

కరోనా వ్యాక్సిన్​ ముడిపదార్థాల సరఫరా విషయంలో భారత్​ ప్రతిపాదనను అంగీకరించొద్దని 12 మంది అమెరికా చట్ట సభ్యులు అధ్యక్షుడు బైడెన్​ బృందాన్ని కోరారు. కరోనా నేపథ్యంలో వర్తక సంబంధిత మేథో సంపత్తి హక్కుల (ట్రిప్స్) నిబంధనలను తాత్కాలికంగా సడలించొద్దని సూచించారు.

కరోనా వైరస్​ ఉద్ధృతిని అడ్డుకునేందుకు ప్రపంచ దేశాలకు ఇప్పుడు వ్యాక్సిన్​ ఒక్కటే ఆయుధంగా కనిపిస్తోంది. దీంతో ప్రపంచంలో వ్యాక్సిన్​ ముడిపదార్థాల ఎగుమతిదారుల్లో ఒకటైన అమెరికా.. ప్రపంచ దేశాలకు సరఫరాను నిలిపివేసింది. వర్తక సంబంధిత మేథో సంపత్తి హక్కుల (ట్రిప్స్) ఒప్పందం నిబంధనలను కఠినతరం చేసింది. దీంతో అభివృద్ధి చెందుతున్న 60 దేశాల తరఫున.. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) వేదికగా.. ట్రిప్స్ నిబంధనలు సడలించాలని భారత్​, దక్షిణాఫ్రికా విజ్ఞప్తి చేశాయి.

అయితే ఆ వినతికి మద్దతుగా నిలవాలని కొందరు అమెరికా చట్టసభ్యులు కోరినప్పటికీ.. కొందరు మాత్రం తిరస్కరిస్తూ.. అగ్రరాజ్య వ్యాపార ప్రతినిధి కేథరిన్ టాయ్​కు లేఖ రాశారు.

భారత్, దక్షిణాఫ్రికా దేశాల అభ్యర్థనను అమెరికా అంగీకరిస్తే.. స్వదేశంలోని ఉత్పత్తిపై ఇది తీవ్ర ప్రభావం చూపిస్తుందని చట్టసభ్యులు అభిప్రాయపడ్డారు.

సాయం చేయాల్సిందే..

భారత్​లో కొవిడ్ వ్యాప్తి విజృంభణ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​కు లేఖ రాశారు ఆ దేశ చట్ట సభ్యురాలు డిబోరా రోస్. ఈ పరిస్థితుల్లో అమెరికా.. భారత్​కు తప్పకుండా సాయం చేయాలని కోరారు. ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలెటర్లు, బైపాప్ మిషన్లు అందించాలని లేఖలో పేర్కొన్నారు.

"గత కొన్ని రోజుల నుంచి భారత్​లో కొవిడ్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. ఇలాంటి సమయంలో అమెరికా.. 100 మిలియన్ డాలర్లు విలువ చేసే వైద్య పరికరాలు భారత్​కు పంపడం హర్షనీయం. బైడెన్​కు ధన్యవాదాలు."

--డిబోరా రోస్, అమెరికా చట్ట సభ్యురాలు.

ఆక్సిజన్ సిలిండర్లు, పీపీఈ కిట్లు మొదలైన వైద్య పరికరాలు మొదలుకొని రాపిడ్ టెస్టు యంత్రాలను కూాడూ భారత్​కు అమెరికా సాయం చేయడం ఇరు దేశాల మధ్య సత్సంబంధాలకు నిదర్శనమని డిబోరా లేఖలో పేర్కొన్నారు. ఈ వేవ్​ను భారత్​ సమర్థంగా ఎదుర్కోవడంలో అమెరికా కృషి చేయాలని తెలిపారు.

ఇదిలా ఉంటే ఇటీవలే ముడిపదార్థాల సరఫరాపై అమెరికా అధ్యక్షుడు బైడన్​తో ప్రధాని మోదీ చర్చించారు. ముడి పదార్థాల సరఫరా సాఫీగా అయ్యేలా చూడాలని కోరారు.

ఇదీ చదవండి:అమెరికాలో సిక్కుపై సుత్తితో నల్ల జాతీయుడి దాడి

Last Updated : May 5, 2021, 12:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.