లాటిన్ అమెరికాలో అతిపెద్ద దేశమైన బ్రెజిల్‌లో కరోనా వైరస్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే అక్కడి ప్రభుత్వం కరోనాను కట్టడి చేయలేక చేతులెత్తేయగా.. కేసులు విపరీతంగా పెరుగతున్నాయి. బాధితుల సంఖ్య పెరగడం వల్ల శవాగారాలు, శ్మశాన వాటికల్లోనూ స్థలం సరిపోవట్లేదు. రియోడిజెనీరో నగరంతో పాటు మరో నాలుగు ప్రధాన నగరాల్లో ఇప్పటికే అన్ని ఆస్పత్రులు కరోనా రోగులతో నిండిపోయాయి.
దేశంలో నెలకొన్న ఈ పరిస్థితి సహా అధ్యక్షుడు జైర్ బోల్సోనారో తీరుకు వ్యతిరేకంగా ఓ వినూత్న నిరసన తెలిపింది ఓ ఎన్జీఏ సంస్థ. ఇందులో ప్రజలు భాగస్వాములయ్యారు.
-
Protesters dig symbolic graves on Brazil’s iconic Copacabana beach as the coronavirus death toll spirals. President Bolsanaro has not taken the outbreak seriously pic.twitter.com/PDaZIRfha9
— James Longman (@JamesAALongman) June 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Protesters dig symbolic graves on Brazil’s iconic Copacabana beach as the coronavirus death toll spirals. President Bolsanaro has not taken the outbreak seriously pic.twitter.com/PDaZIRfha9
— James Longman (@JamesAALongman) June 12, 2020Protesters dig symbolic graves on Brazil’s iconic Copacabana beach as the coronavirus death toll spirals. President Bolsanaro has not taken the outbreak seriously pic.twitter.com/PDaZIRfha9
— James Longman (@JamesAALongman) June 12, 2020
ఒకప్పుడు ఒలింపిక్స్ నిర్వహించిన రియోడిజెనీరో ప్రాంతంలోని బీచ్ వద్ద 100 సమాధులను తవ్వి.. మహమ్మారి బాధితులకు సంతాపం తెలిపారు. ఇది బ్రెజిల్‌లోని 'విలా ఫార్మోసా' శ్మశానవాటికలో పరిస్థితికి అద్దం పడుతోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
కరోనా వైరస్ పెరుగుతున్నా ఆ దేశ అధ్యక్షుడు జైర్ బోల్సెనారో.. పరిస్థితులను తేలిగ్గా తీసుకోవడంపైనా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ మహమ్మారిని ఎదుర్కోడానికి సామాజిక దూరం పాటించాల్సిన అవసరం లేదని, బ్రెజిలియన్లలో అధిక ప్రమాదం ఉన్న వారిని మాత్రమే ఐసోలేట్ చేయాలని ఆయన సూచించడంపై విమర్శలు వస్తున్నాయి.
బ్రెజిల్‌లో ఇప్పటివరకు 41,058 మంది మహమ్మారికి బలయ్యారు. 8 లక్షల 5,649 మందికి కరోనా సోకింది. ప్రపంచంలో అత్యధిక కరోనా మరణాలు సంభవించిన మూడో దేశం ఇదే. తొలి రెండు స్థానాల్లో అమెరికా, బ్రిటన్ ఉన్నాయి.