ETV Bharat / international

స్కూల్ పిల్లలపై పైశాచికం.. దుండగుడి కాల్పుల్లో ఒకరు మృతి

US School Shootings: అమెరికాలోని ఐవా రాష్ట్రంలో జరిగిన కాల్పులు స్థానికంగా కలకలం సృష్టించాయి. పాఠశాల ప్రాంగణంలో గుర్తుతెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

us shooting
అమెరికాలో కాల్పులు
author img

By

Published : Mar 8, 2022, 10:13 AM IST

US School Shootings: అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన వెలుగుచూసింది. ఐవా రాష్ట్రంలోని డెమోయిన్​ ప్రాంతంలో ఉన్న ఈస్ట్​ హైస్కూల్​లో​ ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

సోమవారం (స్థానిక కాలమానం ప్రకారం).. స్కూల్​ నుంచి పలువురు విద్యార్థులు బయటకు వస్తున్నారు. అదే సమయంలో అటుగా వాహనంలో వెళ్తున్న దుండగుడు వారిపై కాల్పులకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆ ప్రాంతానికి వచ్చిన ఓ 15 ఏళ్ల బాలుడు మృతిచెందగా.. ఈస్ట్​ హైస్కూల్​కు చెందిన ఇద్దరు విద్యార్థినులు గాయపడ్డారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న వీరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు.

ఈ ఘటనకు గల కారణం తెలియాల్సి ఉందని.. ఇందుకు సంబంధించి దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు చెప్పారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి : ఉక్రెయిన్‌ దాడిలో రష్యా మేజర్‌ జనరల్‌ మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.