ETV Bharat / international

ఘోర రోడ్డు ప్రమాదం.. 41 మంది మృతి

మాలిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు, లారీ ఢీకొన్న ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు స్థానిక మీడియా పేర్కొంది.

Truck collides with bus in Mali
మాలి రోడ్డు ప్రమాదం
author img

By

Published : Aug 4, 2021, 6:42 AM IST

ఆఫ్రికా దేశమైన మాలిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సామగ్రి, కూలీలతో వెళుతున్న లారీ, ప్రయాణికులతో వెళుతున్న బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 41 మంది చనిపోయారు. 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 20 కిలోమీటర్ల దూరంలోని సెగో పట్టణానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లారీ టైర్‌ పేలడం వల్ల డ్రైవర్‌.. వాహనంపై నియంత్రణ కోల్పోయాడని, దీంతో ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టినట్లు స్థానిక మీడియా వర్గాలు తెలిపాయి.

ఈ ప్రమాదంలో బస్సు ముందుభాగం తీవ్రంగా ధ్వంసమైంది. ప్రమాద తీవ్రతకు క్షతగాత్రులు రోడ్డుపై చెల్లాచెదురగా పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి అక్కడి సోషల్‌ మీడియాలో ఫొటోలు, వీడియోలు వైరల్‌ అయ్యాయి. డబ్ల్యూహెచ్‌ఓ ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన రోడ్లు ఆఫ్రికా దేశాల్లో దర్శనమిస్తాయి. ఏటా అక్కడి దేశాల్లో ప్రతి లక్ష జనాభాకు రోడ్డు ప్రమాదాల్లోనే 26 మంది చనిపోతున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి.

ఇదీ చూడండి: అమెరికా పెంటగాన్ సమీపంలో కాల్పుల కలకలం-పోలీసు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.