టునీసియాలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. సఫాక్స్ నగరానికి సమీపంలోని సముద్రంలో పడవ మునిగి 21మంది వలసదారులు మృతి చెందారు. చనిపోయిన వారిలో 9మంది మహిళలు, ఓ పాప కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరో ముగ్గురిని కోస్ట్ గార్డ్ సిబ్బంది రక్షించారు. అయితే ప్రమాదానికి కారణం ఇంకా తెలియలేదు.
ప్రమాదం జరిగిన బోటులో మొత్తం 40 మందికిపైగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. గల్లంతైన వారికోసం సహాయ బృందాలు గాలిస్తున్నాయి.
మార్చి9న కూడా రెండు పడవలు ఇదే ప్రాంతంలో మునిగాయి. 39మంది మృతి చెందారు. 165మందిని రక్షించారు.
ఆఫ్రికా దేశాలలోని దయనీయమైన పరిస్థితులు, పేదరికం, ఉద్రిక్తతల నుంచి ప్రజలు తప్పించుకుని యూరప్ దేశాలకు వలస వెల్లడానికి ఈ పోర్టు సిటీ ప్రధాన కేంద్రంగా ఉంది.
ఇదీ చదవండి: శృంగారాన్ని నిరాకరించే హక్కు మహిళలకు తక్కువే!