సైనిక నిర్బంధంలో ఉన్న మాలి అధ్యక్షుడు ఇబ్రహీం బూబకర్ కీతా తన పదవికి రాజీనామా చేశారు. పార్లమెంటును రద్దు చేసినట్లు ఆ దేశ టీవీ ఛానల్ వేదికగా ప్రకటించారు. తిరుగుబాటు సైనికులు ఆయనను నిర్బంధించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు బూబకర్.
బూబకర్ రాజీనామా చేయాలంటూ దేశవ్యాప్తంగా రెండు నెలలకు పైగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఇస్లాం తిరుగుబాట్లను బూబకర్ ప్రోత్సహిస్తున్నారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంలో కీతా మద్దతుదారులు కూడా ఆయన నుంచి దూరంగా జరిగారు.
ఏడాది కాలంగా ఇస్లామిక్ స్టేట్, ఆల్‌ఖైదా అనుబంధ సంస్థలు సైన్యంపై దాడులకు పాల్పడుతున్నారు. 2019లో ఉత్తర ప్రాంతంలో తీవ్రమైన దాడులు జరిగాయి.
ఇదీ చూడండి: సైన్యం తిరుగుబాటు- దేశాధ్యక్షుడు, ప్రధాని నిర్బంధం!