ఆఫ్రికాలోని నైజీరియాలో సాయుధులు జరిపిన కాల్పుల్లో 10మంది మృతిచెందారు. ఆదివారం రాత్రి కొందరు దుండగులు దక్షిణ జోస్ ప్రాంతంలోని ఓ బార్లో కాల్పులకు తెగబడినట్టు అధికారులు వెల్లడించారు.
కాల్పులు జరిగిన ప్రాంతంలో భద్రతా దళాలను మొహరించినట్లు అధికారులు తెలిపారు. ఇటీవలే ఆఫ్రికాలో సాయుధులు పలు గ్రామాలపై కాల్పులు జరిపారు. ఈ ఘటనల్లో అనేక మంది పౌరులు, అధికారులు మరణించారు.
ఇదీ చదవండి:రెచ్చిపోయిన సాయుధులు- 100 మంది పౌరులు హతం