ఈజిప్టులోని ఓ ఆసుపత్రిలో ప్రమాదం చోటు చేసుకుంది. ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో భారీగా మంటలు చెలరేగడం వల్ల... ఏడుగురు కరోనా రోగులు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు.
ఈ ఘటనలో గాయపడిన వారిని సమీపంలోని మరో ఆసుపత్రి తరలించారు. ఉన్నట్లుండి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. షార్ట్-సర్క్యూట్ కారణంగా మంటలు చెరేగాయని స్థానిక మీడియా తెలిపింది. అయితే ఇందుకు సంబంధించి పూర్తిస్థాయి దర్యప్తు నివేదికను అందజేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.