ETV Bharat / international

ఆల్బర్ట్​ సరస్సులో పడవ బోల్తా- 33మంది మృతి

ఉగాండా-కాంగో మధ్యలో ఉన్న ఆల్బర్ట్​ సరస్సులో పడవ బోల్తాపడి 33 మంది మరణించగా.. మరో ఏడుగురు ప్రాణాలతో బయటపడ్డారని అధికారులు తెలిపారు.

Boat capsizes between Uganda and Congo, killing more than 30
ఆల్బర్ట్​ సరస్సులో పడవ బోల్తా- 33మంది మృతి
author img

By

Published : Dec 24, 2020, 7:41 PM IST

Updated : Dec 24, 2020, 10:34 PM IST

ఉగాండా నుంచి కాంగో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 33 మంది మృతి చెందారు. మరో ఏడుగురు ప్రాణాలతో బయటపడ్డారు. ఇరు దేశాలకు నడుమ ఉన్న కొలోకోటో పట్టణానికి సమీపంలో ఆల్బర్ట్​ సరస్సులో రాత్రిపూట బోటు ప్రమాదానికి గురైందని అధికారులు తెలిపారు. మరణించినవారిలో ఎక్కువ మంది కరోనా నిబంధనలు తప్పించుకుని అక్రమంగా కాంగో వెళ్తున్నవారే ఉన్నట్లు వెల్లడించారు.

ఉగాండాలో కరోనా విజృంభణ కొనసాగుతుండగా.. వైరస్​ వ్యాప్తి కట్టడిలో భాగంగా కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. ఈ క్రమంలో ఉగాండాలో చిక్కుకుపోయిన కాంగో వాసులు.. కొవిడ్​ ఆంక్షలను ఉల్లంఘించి తమ దేశానికి(కాంగో) వెళ్లిపోవాలని భావిస్తున్నారని.. ఈ నేపథ్యంలోనే ప్రమాదం సంభవించిందని పేర్కొన్నారు. బలమైన గాలులు వీయడమే ఘటనకు కారణమని భావిస్తున్నారు.

ఇదీ చూడండి: సముద్రంలో పడవ మునిగి 20మంది మృతి

Last Updated : Dec 24, 2020, 10:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.