సోమాలియా రాజధాని మొగదిసులో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో 11మంది తీవ్రంగా గాయపడ్డారు. అల్ షబాబ్ అనే ఉగ్రవాదం సంస్థ ఈ దాడికి పాల్పడినట్లు ప్రకటించింది.
ఓ వాహనంలో పేలుడు పదార్థాలు నిపుకొని పోలీసు హెడ్ క్వార్టర్స్లోకి ప్రవేశించేందుకు దుండగుడు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో అక్కడ పేల్చుకోవటం వల్ల ఇద్దరు పోలీసులు, మరో ముగ్గురు పౌరులు అక్కడే ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. అతన్ని అడ్డుకోకపోతే పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం జరిగేదని ఆందోళన వ్యక్తం చేశారు.
క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించే క్రమంలో ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి: మందుపాతర పేలి నలుగురు మృతి