ప్రపంచంపై కొవిడ్ ఉగ్రరూపం కొనసాగుతోంది. దాదాపు అగ్రదేశాలన్నింటిపై వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 1,06,89,000 మందికిపైగా వైరస్ సోకింది. మొత్తం 5 లక్షల 16 వేల మందికిపైగా మృతిచెందారు. మరో 58 లక్షల మందికిపైగా వ్యాధి నయమైంది. మొత్తం 54 దేశాలు కలిగిన ఆఫ్రికాలో ఇప్పటివరకు 4 లక్షల 4 వేల మంది మహమ్మారి బారినపడ్డారు. 10వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. లక్షా 51వేల కేసులు ఒక్క దక్షిణాఫ్రికాలోనే నమోదయ్యాయి.
ఒక్కరోజు వ్యవధిలో ఎక్కువ కేసులు నమోదైన దేశాలివే..
- పొరుగు దేశం నేపాల్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. 24 గంటల వ్యవధిలో ఆ దేశంలో 482 మందికి వైరస్ సోకగా.. మొత్తం బాధితుల సంఖ్య 14 వేలు దాటింది.
- సింగపూర్‌లో ఒక్కరోజులో 215 మందికి వైరస్ సోకింది. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 44,122కు చేరింది. భారత్ నుంచి సింగపూర్‌కు వెళ్లిన ఓ మహిళకు కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్లు అక్కడి వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- వైరస్ పుట్టినిల్లు చైనాలో మూడు కొత్త కేసులు వెలుగుచూశాయి. ఇప్పటివరకు ఆ దేశంలో 83,534 మంది కరోనా బారినపడగా.. 4,634 మంది చనిపోయారు.
ఇదీ చదవండి: 'ప్రపంచ దేశాలు ఆ రెండింటికీ ప్రాధాన్యతనివ్వాలి'